Viral: స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసి క్రేజీ సూచనలు ఇచ్చిన కస్టమర్.. నెటిజన్లు ఎలాంటి కామెంట్లు చేశారంటే..
ABN , First Publish Date - 2023-08-21T15:36:06+05:30 IST
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు అందుబాటులోకి వచ్చాక నగర వాసులకు చాలా సౌలభ్యం దొరికింది. ఇంటి దగ్గర కూర్చునే నచ్చిన ఫుడ్‌ను జొమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్ ఫుడ్ యాప్‌ల ద్వారా తెప్పించుకోవచ్చు. అంతేకాదు మనకు ఆహారం ఎలా ఉండాలో సూచనలు ఇచ్చే సౌలభ్యం కూడా ఈ యాప్‌లు అందజేస్తున్నాయి.
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ (Food delivery Apps)లు అందుబాటులోకి వచ్చాక నగర వాసులకు చాలా సౌలభ్యం దొరికింది. ఇంటి దగ్గర కూర్చునే నచ్చిన ఫుడ్‌ను జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) వంటి ఆన్‌లైన్ ఫుడ్ యాప్‌ల ద్వారా తెప్పించుకోవచ్చు. అంతేకాదు మనకు ఆహారం ఎలా ఉండాలో సూచనలు ఇచ్చే సౌలభ్యం కూడా ఈ యాప్‌లు అందజేస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి స్విగ్గీ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసి రెస్టారెంట్‌కు నిర్ధిష్టమైన సూచనలు (Cooking Instructions) కూడా ఇచ్చాడు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ (Viral)అవుతోంది.
@pachtaogaybro అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ పోస్ట్ చేశారు. ``ఈ వారంతంలో ఫుడ్ ఆర్డర్ చేయాలని అనుకున్నాం. ఫుడ్ ఆర్డర్ చేసి మా నాన్న రాసిన కుకింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ చూడండి`` అని నెటిజన్ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఆ వ్యక్తి పన్నీర్ టిక్కా రోల్‌ను ఆర్డర్ చేసి.. ``ఈ ఆర్డర్ బిట్టూ దగ్గర్నుంచి వచ్చిందని సందీప్‌కు చెప్పండి. అప్పుడు అతడు ఫాస్ట్‌గా రెడీ చేస్తాడు`` అని రాశారు. సందీప్ అంటే ఆ రెస్టారెంట్‌లో పని చేసే సిబ్బంది అని తెలుస్తోంది.
Interesting video: వివిధ దేశాల విమానాశ్రయాల్లో లగేజ్‌ను ఎలా తీస్తున్నారో చూడండి.. హర్ష్ గోయెంకా ఆసక్తికర విశ్లేషణ!
ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 2.6 లక్షల మందికి పైగా ఈ ట్వీట్‌ను వీక్షించారు. 5 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ``నిజ జీవితంలో ఈ రకమైన చేరువ ఉండాలి``, ``మానవ సంబంధాల విషయంలో ఆ అంకుల్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు`` అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.