X-Ray Report: నడుము కింది భాగంలో భరించలేని నొప్పి.. ఎక్స్‌రే రిపోర్టులు చూసి నివ్వెరపోయిన డాక్టర్లు.. పోలీసుల ఎంట్రీతో..!
ABN , First Publish Date - 2023-07-11T19:19:23+05:30 IST
ఆ వ్యక్తి రోజు కూలీ.. రోజూ కష్టపడి పని చేస్తేనే గాని పూట గడవదు.. అతడు నడుము కింద భాగంలో నొప్పితో విపరీతంగా బాధపడుతున్నాడు.. చివరకు స్పృహ కూడా కోల్పోడంతో కుటుంబ సభ్యులు అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.. డాక్టర్లు ఆ వ్యక్తికి ఎక్స్‌రే తీయించారు.. ఆ రిపోర్ట్ చూసి డాక్టర్లు నివ్వెరపోయారు..
ఆ వ్యక్తి రోజు కూలీ.. రోజూ కష్టపడి పని చేస్తేనే గాని పూట గడవదు.. అతడు నడుము కింద భాగంలో నొప్పితో విపరీతంగా బాధపడుతున్నాడు.. చివరకు స్పృహ కూడా కోల్పోడంతో కుటుంబ సభ్యులు అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.. డాక్టర్లు ఆ వ్యక్తికి ఎక్స్‌రే తీయించారు.. ఆ రిపోర్ట్ (X-Ray Report) చూసి డాక్టర్లు నివ్వెరపోయారు.. ఎందుకంటే అతడి లోపల ఏడు అంగుళాల పొడవు, మూడు అంగుళాల వెడల్పు ఉన్న ప్లాస్టిక్ డబ్బా (Plastic Can) ఉంది. షాకైన డాక్టర్లు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు (Crime News).
రాజస్థాన్ (Rajasthan)లోని బికనీర్‌లో నివసిస్తున్న రామ్ కుమార్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ కూలిపనికి వెళ్లి వస్తుండేవాడు. మూడు రోజుల క్రితం అతడు కాలకృత్యాలు తీర్చుకునేందుకు సమీపంలోని అడవికి వెళ్లాడు. ఆ సమయంలో కొందరు దుండగులతో రామ్‌కుమార్‌కు గొడవ జరిగింది. వారందరూ కలిసి రామ్‌కుమార్‌ను తీవ్రంగా కొట్టారు. అనంతరం అతడి వెనుక నుంచి ఓ ప్లాస్టిక్ డబ్బాను లోపలికి తోసేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత రామ్‌కుమార్ ఎలాగోలా ఇంటికి చేరుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత స్పృహ కూడా కోల్పోయాడు.
Viral: కష్టపడకుండానే కోట్లు సంపాదించేందుకు ఓ వ్యక్తి వెరైటీ ప్లాన్.. పోలీసులే అతడిని వెతుక్కుంటూ రావడంతో..!
కుటుంబ సభ్యులు రామ్‌కుమార్‌ను వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. డాక్టర్లు వెంటనే రామ్‌కుమార్‌కు ఎక్స్‌రే తీశారు. అతడి లోపల ప్లాస్టిక్ క్యాన్ ఉన్నట్టు గుర్తించి వెంటనే ఆపరేషన్ చేసి దానిని బయటకు తీసేశారు. ప్రస్తుతం రామ్‌కుమార్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. కాగా, రామ్‌కుమార్ స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపులు ప్రారంభించారు.