Viral Video: రియల్ హీరోవంటే నువ్వే బ్రదరూ.. వరదలో ఓ లేగదూడ కొట్టుకుని పోతోంటే ఈ కుర్రాడు ఏం చేశాడో మీరే చూడండి..!
ABN , First Publish Date - 2023-05-16T12:17:48+05:30 IST
మానవత్వం అనేది చాలా గొప్ప లక్షణం. ఎటువంటి స్వార్థమూ లేకుండా సాటి మనిషికి సహాయం చేయాలంటే చాలా గొప్ప మనసు ఉండాలి. జంతువులకు సహాయం చేయాలంటే మరింత ఉన్నతుడై ఉండాలి.
మానవత్వం (Humanity) అనేది చాలా గొప్ప లక్షణం. ఎటువంటి స్వార్థమూ లేకుండా సాటి మనిషికి సహాయం చేయాలంటే చాలా గొప్ప మనసు ఉండాలి. జంతువులకు సహాయం చేయాలంటే మరింత ఉన్నతుడై ఉండాలి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో (Viral Video) ఓ కుర్రాడు తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఓ లేగదూడను కాపాడాడు (Man risked his life to save a calf ). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Raunak Singh అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. ఓ నదికి (River) వరదలు వచ్చి నీరు చాలా వేగంగా ప్రవహిస్తోంది. ఆ నదిలోకి అనుకోకుండా ఓ లేగదూడ (Calf) దిగింది. అయితే నది ఉధృతికి తట్టుకోలేక కొట్టుకుపోయింది. ఆ దూడ బతకడం కష్టం అని అనుకుంటుండగానే ఓ యువకుడు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి నీటిలోకి దూకాడు. ఆ కుర్రాడు కూడా మొదట్లో నీటి ప్రవాహానికి ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత ఒడ్డున ఉన్న మెట్టును పట్టుకుని దూడను కూడా కాపాడాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: ఐపీఎల్ మ్యాచ్‌ను చూసేందుకు వెళ్లి.. స్టేడియంలోనే ఓ కుర్రాడి వింత నిర్వాకం.. ఓ వ్యక్తి చాటుగా వీడియో తీయడంతో..
ఈ వీడియోను 3.75 లక్షల మంది లైక్ చేశారు. అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన కుర్రాడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ``కలియుగంలో కూడా అలాంటి మనుషులు ఉండడం గొప్ప విషయమే``, ``ఆ కుర్రాడికి చాలా గుండె ధైర్యం ఉంది``, ``ఆ నీటి ప్రవాహాన్ని చూస్తే భయమేస్తోంద``ని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.