Share News

Viral: గొడవ పడినందుకు సరదా తీర్చాడు.. బ్యాంక్ సిబ్బంది చేత రూ.6.5 కోట్లు లెక్క పెట్టించాడు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

ABN , First Publish Date - 2023-10-29T16:28:22+05:30 IST

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కరెన్సీ కట్టలను లెక్కించడం చాలా సులభంగా మారిపోయింది. ప్రపంచంలోని దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ నోట్లను లెక్కించేందుకు మెషిన్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఎంత పెద్ద మొత్తాన్నైనా ఆ మెషిన్స్‌తో చాలా సులభంగా లెక్క పెట్టవచ్చు.

Viral: గొడవ పడినందుకు సరదా తీర్చాడు.. బ్యాంక్ సిబ్బంది చేత రూ.6.5 కోట్లు లెక్క పెట్టించాడు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కరెన్సీ కట్టలను (Money) లెక్కించడం చాలా సులభంగా మారిపోయింది. ప్రపంచంలోని దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ (Banks) నోట్లను లెక్కించేందుకు మెషిన్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఎంత పెద్ద మొత్తాన్నైనా ఆ మెషిన్స్‌తో చాలా సులభంగా లెక్క పెట్టవచ్చు. అలాగే దొంగనోట్లును కూడా సులభంగా పసిగట్టే మెషిన్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో బ్యాంకు సిబ్బంది (Bank Staff) ఎవరూ నోట్లను చేతులతో లెక్కించడం లేదు. అయితే చైనా (China)లోని ఓ వ్యక్తి మాత్రం బ్యాంకు సిబ్బందికి ఝులక్ ఇచ్చాడు.

తను విత్ డ్రా చేసిన మొత్తం రూ.6.5 కోట్లను బ్యాంకు సిబ్బంది స్వయంగా లెక్క పెట్టాలని పట్టుబట్టాడు. షాకైన బ్యాంకు సిబ్బంది అతను చెప్పింది చేయక తప్పలేదు. చైనాకు చెందిన ఓ మిలయనీర్ 2021లో బ్యాంక్ ఆఫ్ షాంఘై బ్రాంచ్‌లోకి ప్రవేశించినప్పుడు మాస్క్‌ ధరించలేదని సిబ్బంది అడ్డుకున్నారు. ఆ సమయంలో ప్రోటోకాల్ ప్రకారం భద్రతా సిబ్బంది అతనిని బ్యాంకు లోపలికి వెళ్లనివ్వలేదు. దాంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఏదేమైనా అతడిని మాత్రం బ్యాంకులోనికి రానివ్వలేదు.

Shocking Video: ఫైవ్‌స్టార్ హోటల్‌కు వెళ్లిన ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం.. బాత్రూమ్‌లో ఏదో సౌండ్ వస్తోందని చూస్తే..

తనను అవమానించిన బ్యాంకు సిబ్బందిపై పగ తీర్చుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. బ్యాంక్ ఆఫ్ షాంఘైలో ఉన్న తన డిపాజిట్ మొత్తాన్ని విత్ డ్రా చేయాలని నిర్ణయించుకున్నాడు. తను డిపాజిట్ చేసిన రూ.6.5 కోట్లను విత్ డ్రా చేశాడు. అయితే ఆ మొత్తాన్ని మెషిన్‌తో కాకుండా సిబ్బంది లెక్కించాలని మెలిక పెట్టాడు. దీంతో బ్యాంకు సిబ్బందికి అతడు చెప్పింది చేయక తప్పింది కాదు. బ్యాంకు సిబ్బంది చేతితో లెక్కించేందుకు దాదాపు 2 గంటల సమయం పట్టింది. ఆ డబ్బులను ఇతర బ్యాంకుల్లో దాచుకుంటానని ఆ వ్యక్తి చెప్పారు.

Updated Date - 2023-10-29T16:28:22+05:30 IST