ఈ గుర్తులు చూశాకే ఆహార పదార్థాల ప్యాకెట్లు కొనుగోలు చేయండి... లేదంటే పశ్చాత్తాపం తప్ప మరేంచేయలేరు...

ABN , First Publish Date - 2023-04-23T12:03:11+05:30 IST

మీరు ఇంటికి తీసుకువచ్చే ప్యాక్డ్ ఆహార పదార్థాలపై(packaged foods) ఉండే కొన్ని గుర్తులను ఎప్పుడైనా గమనించారా? లేకపోతే ఇప్పుడు తెలుసుకోండి. మున్ముందు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ గుర్తులు చూశాకే ఆహార పదార్థాల ప్యాకెట్లు కొనుగోలు చేయండి... లేదంటే పశ్చాత్తాపం తప్ప మరేంచేయలేరు...

మీరు ఇంటికి తీసుకువచ్చే ప్యాక్డ్ ఆహార పదార్థాలపై(packaged foods) ఉండే కొన్ని గుర్తులను ఎప్పుడైనా గమనించారా? లేకపోతే ఇప్పుడు తెలుసుకోండి. మున్ముందు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆహార ప్యాకెట్‌పై ముదురు గోధుమ రంగులో(Dark brown in color) గుండ్రని చుక్క కనిపిస్తే అందులో మాంసాహారం మూలకం ఉందని అర్థం. మీరు శాకాహారులైతే, లేదా మాంసం తిననివారైతే మీరు ఏదైనా ఆహార పదార్థాన్ని కొనుగోలు చేసినప్పుడు దానిపై ఈ గుర్తు ఉందో లేదో తప్పక తనిఖీ చేయండి. ముఖ్యంగా చాక్లెట్, నూడుల్స్(Chocolate, noodles) లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఏదైనా ఉత్పత్తిపై ఈ గుర్తు ఉందో లేదో చూడండి.

ఏదైనా ఆహార పదార్ధపు ప్యాకెట్‌పై ఆకుపచ్చ రంగు(green color) చుక్క గుర్తు ఉంటే, అది పూర్తి శాఖాహారమని గుర్తించండి. అంటే అందులో ఎలాంటి మాంసం భాగం ఉండదని అర్థం. అలాగే దీనిలో రసాయన పరిమాణం(Chemical quantity) చాలా తక్కువ అని గుర్తించండి. ఇది మీ ఆరోగ్యానికి కూడా మంచిది. ఏదైనా ఆహార పదార్థంపై నల్లని గుండ్రని మార్క్ కనిపిస్తే అది రసాయనాలు అధికంగా ఉన్న పదార్థమని అర్థం.

అంటే దీని తయారీలో పలు రసాయనాలు వాడారని తెలుసుకోండి. ఇది ఆరోగ్యానికి హానికరం(Harmful) అని గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఆహారపు ఉత్పత్తి ప్యాకెట్‌పై ఎరుపు రంగులో గుండ్రని గుర్తు ఉంటే, దానిని తయారు చేయడానికి రసాయన మూలకాలు ఉపయోగించారని అర్థం. అలాగే ఏదైనా ఆహారపు ఉత్పత్తిపై నీలి రంగు గుర్తు కనిపిస్తే దాని తయారీలో రసాయనాలను ఉపయోగించారని అర్థం. ఎక్కువగా టూత్‌పేస్ట్(Toothpaste) లేదా ఏదైనా క్రీమ్ ప్యాక్ దిగువ భాగంలో ఎరుపు, నీలి రంగు గుర్తులు కనిపిస్తాయి.

Updated Date - 2023-04-23T12:06:55+05:30 IST