Marriage: అమ్మ బాబోయ్.. ఇదేం వింత ఆచారం.. పెళ్లయ్యాక మొదటి మూడ్రోజులు వధూవరులకు వింత కండీషన్..!
ABN , First Publish Date - 2023-06-22T14:32:22+05:30 IST
మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరగడానికి పెళ్ళిళ్లు అతిపెద్ద వేదికలు. ఈ పెళ్ళిళ్ళలో ఒక్కొక్కరు ఒక్కోవిధమైన ఆచార సంప్రదాయాలు కలిగి ఉంటారు. కొన్ని ఆచారాల కారణంగా ఆయా వర్గాలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఇప్పుడు పెళ్ళిలో పాటించే ఓ సాంప్రదాయం అందరికీ షాకిస్తోంది.
మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరగడానికి పెళ్ళిళ్లు అతిపెద్ద వేదికలు. ఈ పెళ్ళిళ్ళలో ఒక్కొక్కరు ఒక్కోవిధమైన ఆచార సంప్రదాయాలు కలిగి ఉంటారు. కొన్ని ఆచారాల కారణంగా ఆయా వర్గాలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి కూడా. ఇప్పుడు పెళ్ళిలో పాటించే ఓ సాంప్రదాయం కారణంగా ఓ వర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెళ్ళయిన వధూవరులకు 3రోజుల పాటు వారు పెట్టే కండీషన్ చాలా వింతగానూ, షాకింగానూ అనిపిస్తోంది. ఇంతకూ ఈవింత కండీషన్ ఏంటి? దీన్ని ఎక్కడ పాటిస్తారు పూర్తీగా తెలుసుకుంటే..
పెళ్ళిళ్ళు(Marriages) రెండు కుటుంబాల మధ్య జరిగే అతి పెద్ద వేడుకలు. ఇవి కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో వారి సాంప్రదాయాలకు అనుగుణంగా జరుగుతాయి. అయితే ఇండోనేషియా(Indonesia), మలేషియాలోని బోర్నియో(Borneo in Malaysia), ప్రావిన్స్(Province) లో నివసిస్తున్న ట్రిడాంగ్ తెగలు తమ పెళ్ళిళ్ళలో వింత సాంప్రదాయాలు(strange traditions) ఫాలో అవుతారు. ఈ తెగలలో పెళ్ళిజరిగితే వధూవరులను 3రోజుల పాటు ఒక గదిలో బంధిస్తారు. ఆ మూడురోజులు ఆ వధూవరులను బాత్రూమ్ కు అనుమతించరు(3days bathroom not allowed). వధూవరులు ఈ ఆచారం కచ్చితంగా ఫాలో అయ్యేలా చర్యలు తీసుకుంటారు. ఈ కారణంతోనే ఇద్దరినీ కలిపి గదిలో బంధిస్తారు. గదులకు బయట కాపలా ఉంటారు. ఈ మూడురోజులు వధూవరులు గదిలోనే ఉండి ఈ కష్టాన్ని భరిస్తే వారు జీవితాంతం ఎంతో సంతోషంగా ఉంటారట. ఇలా సక్సెస్ అయినవారు తమ కుటుంబ సభ్యులతో కలసి వేడుక చేసుకుంటారు. ఒకవేళ ఎవరైనా ఈ కండీషన్ ను బ్రేక్ చేస్తే ఆ జంట తొందరలోనే విడిపోతుందని, వారు తొందరలోనే చనిపోతారని వీరి నమ్మకం.
Viral News: అమ్మ బాబోయ్.. ఈ కాలేజీ అమ్మాయిలు భలే స్కెచ్ వేశారుగా.. మంచినీళ్లు కావాలని షాపులోని వ్యక్తికి చెప్పి..!
మూడురోజుల పాటు మలమూత్రాలు శరీరం నుండి బయటకు వెళ్ళకుండా ఉంటే శరీరం పై దుష్ప్రభావం పుడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఈ ఇబ్బందిని తగ్గించే క్రమంలో మూడురోజుల పాటు వధూవరులకు ఆహారం, ద్రవాలు(food and liquids) చాలా తక్కువగా ఇస్తారు. ఈ ఆచారం ఎప్పటినుండో అమలవుతున్నా నేటితరం వారు కూడా దీన్ని తోసిపుచ్చడం లేదు. కొత్తగా పెళ్ళిచేసుకోబోయేవారు వివాహానికి ముందే ఈ కండీషన్ ఫాలో అవ్వడానికి మానసికంగా సన్నద్దమవుతారు.