రెండు రోజుల్లో పెళ్లనగా ఇలా జరిగిందేంటి..? ఈ వధువు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరగాల్సి వస్తోందంటే..

ABN , First Publish Date - 2023-02-20T14:14:15+05:30 IST

పెళ్ళికూతురుకు మెహందీ ఫంక్షన్, మంగళ స్నానం అన్నీ అయిపోయాయి. అటు అబ్బాయిని కూడా పెళ్ళికొడుకును చేశారు. బంధువులందరూ ఒక్కొకరుగా ఇంటికొస్తున్నారు. ఇలాంటి సమయంలో

రెండు రోజుల్లో పెళ్లనగా ఇలా జరిగిందేంటి..? ఈ వధువు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరగాల్సి వస్తోందంటే..

పెళ్ళికి ఆహ్వాన పత్రికలు అన్నీ పంచేశారు, పెళ్ళికూతురుకు మెహందీ ఫంక్షన్, మంగళ స్నానం అన్నీ అయిపోయాయి. అటు అబ్బాయిని కూడా పెళ్ళికొడుకును చేశారు. బంధువులందరూ ఒక్కొకరుగా ఇంటికొస్తున్నారు. ఇలాంటి సమయంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. కళకళలాడాల్సిన పెళ్ళికూతురు ముఖం దిగులుతో పోలిస్ స్టేషన్ చూట్టూ తిరిగేలా మారింది పరిస్థితి. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్ రాష్ట్రం చంబల్ నది ఒడ్డున ఉన్న కోటా నగరం ఉంది. ఈ నగర పరిధిలో నాంటా ప్రాంతంలో ప్రహ్లాద్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. వీరి కుటుంబం టైల్స్ వ్యాపారం చేస్తోంది. ఇతని కొడుకు చంద్రప్రకాశ్ కు విజ్ఞాన్ నగర్ కు చెందిన గాయత్రితో పెళ్లి ఖాయమైంది. ఈ క్రమంలో అమ్మాయి ఇంట్లో మెహంది ఫంక్షన్, మంగళ స్నానాలు పూర్తయ్యాయి. ఇటువైపు అబ్బాయి ఇంట్లోనూ పెళ్లికి అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. పెళ్ళికొసం ఇంటి బయట షామియానాలు వేస్తున్నారు. అప్పుడే అక్కడికి చుట్టుపక్కల కుటుంబాల వారు వచ్చారు. 'మీరు షామియానా వేయకండి. మీ ఇంటికి సంబంధం లేని ప్రాంతంలో షామియానా ఎలా వేస్తారు?' అని అన్నారు. పెళ్ళికొడుకు కుటుంబానికి, ఇరుగుపొరుగు వారికి మధ్య వాదన జరిగింది. ఒకరినొకరు తోసుకునేదాకా గొడవ వెళ్ళింది.

Read also: Shocking Video: చావు ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం.. బల్లపై కూర్చుని అన్నం తింటూనే ఈ సెక్యూరిటీ గార్డ్ ఎలా చనిపోయాడంటే..!


పెళ్ళికొడుకు ఇంటికి దగ్గర్లో నివసించే సురేంద్ర అనే వ్యక్తి ఈ గొడవ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతడి ఫిర్యాదు మేరకు పెళ్ళికొడుకు చంద్రప్రకాశ్ ను, అతని తండ్రి ప్రహ్లాద్ ను అరెస్టు చేసి వారిని జైల్లో పెట్టారు. ఈ విషయం తెలిసి పెళ్లికూతురు గాయత్రి ఇంట్లో తీవ్ర విషాదం ఏర్పడింది. పెళ్లి ఎంతో హాయిగా జరిగిపోతుందిలే అనుకున్నవారు బాగా కలత చెందారు. పాపం పెళ్లికూతురు పోలీసుల చుట్టూ తిరిగి ఆధారాలు అన్నీ చూపించింది. కానీ పోలీసులు మాత్రం వారిని వదిలిపెట్టలేదు.

పెళ్ళికొడుకు ఇంటి బయట గొడవ జరిగిన రోజు అబ్బాయికి గొడవలో జోక్యం ఎందుకని ఇంటి పైన గదిలోకి తీసుకెళ్లి గొళ్ళెం వేశామని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇక పెళ్లి కొడుకు తండ్రి ఆయన మేనకొడలు మంగళ స్నానం ఫంక్షన్ ఉండటంతో అక్కడికి వెళ్లాడట. పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరూ గొడవ సమయంలో అక్కడ లేరని అంటున్నారు. సంఘటన జరిగినప్పుడు అక్కడ చాలా వీడియోస్ తీశారు. ఆ వీడియోలలో ఎక్కడా పెళ్ళికొడుకు కానీ, అతని తండ్రి కానీ కనిపించలేదు. కాగా పోలీస్ సూపరిడెంట్ మాట్లాడుతూ పెళ్ళికొడుకు గొడ్డలితో దాడి చేశాడని, ఆ దాడిలో ఒక అబ్బాయికి తలమీద గాయమయ్యిందని అంటున్నారు. బాధితుడికి తీవ్ర రక్తస్రావం జరిగిందని అందుకే వాళ్ళను అరెస్ట్ చేశామని చెప్పారు. పెళ్ళికొడుకు కుటుంబం విషయంలో పోలీసులు కావాలనే ఇలా చేస్తున్నారని అబ్బాయి తరపు కుటుంబ సభ్యులు చుట్టాలు చెప్పారు. పోలీసుల మీద రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని కొందరన్నారు. అందుకే పోలీసులు లేని నిందలు వేస్తున్నారని అంటున్నారు.

Updated Date - 2023-02-20T14:14:33+05:30 IST