Marriage: మంచి వరుడిని చూసి పెట్టండి.. రూ.4 లక్షలు గిఫ్ట్‌గా ఇస్తానంటూ ఓ యువతి బంపరాఫర్..!

ABN , First Publish Date - 2023-07-14T16:50:57+05:30 IST

పెళ్ళి కోసం అబ్బాయిలు తంటాలు పడటం చూసి ఉంటారు కానీ ఓ మహిళ వరుడి కోసం అవస్థలు పడుతోంది. నాకు మంచి వరుడిని చూసి పెట్టండి 4లక్షలు ఇస్తానంటూ అనౌన్స్ చేసింది.

Marriage: మంచి వరుడిని చూసి పెట్టండి.. రూ.4 లక్షలు గిఫ్ట్‌గా ఇస్తానంటూ ఓ యువతి బంపరాఫర్..!

బాగా చదువుకుంటే ఉద్యోగమైనా వస్తుందేమో కానీ పెళ్ళిళ్ళు మాత్రం అంత ఈజీగా జరగడం లేదు ఇప్పట్లో. ముఖ్యంగా అమ్మాయుల శాతం తక్కువగా ఉండటంతో అబ్బాయిలు పడరాని పాట్లు పడుతున్నారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. పెళ్ళి కోసం ఓ యువతి ఏకంగా ప్రకటన ఇచ్చింది. ఓ యువతికి కుర్రాళ్లు నచ్చడం లేదట. అందుకే నాకు మంచి వరుడిని చూసి పెట్టండి మీకు 4లక్షలు గిఫ్ట్ గా ఇస్తానంటూ ఆమె సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. అంతే కాదు, తను చేసుకోబోయే కుర్రాడికి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి పాయింట్ టూ పాయింట్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ విషషయం గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

యుఎస్(US) లోని లాస్ ఏంజిల్స్(Los Angeles) ప్రాంతంలో ఈవ్ టిల్లీ-కౌల్సన్ అనే మహిళ నివసిస్తోంది. ఈమె కార్పోరేట్ లిటిగేషన్ అటార్నీగా పనిచేస్తోంది. ఈమె ప్రస్తుత వయసు 35ఏళ్ళు(35years old women). ఇప్పటికీ ఆమెకు పెళ్ళి కాలేదు. దీనికి కారణం ఆమెకు ఎవరూ సరిగా నచ్చకపోవడమేనట. ఆమె మంచి రిలేషన్ కోసం ఇప్పటివరకు చాలామందితో డేటింగ్ కు వెళ్ళిందట. కానీ ఎవరితోనూ ఆమెకు సెట్ కాలేదు. దీంతో ఆమె విసిగిపోయింది. 'నాకు మంచి వరుడిని(Groom) చూసి పెట్టండి' అంటూ టిక్ టాక్ వేదికగా అనౌన్స్ చేసింది. తనకు మంచి భర్తను చూసి పెడితే వారికి 4లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తానని చెప్పింది. ఈమెకుటిక్ టాక్ లో ఏకంగా 10లక్షల మంది అనుచరులుఉండటం గమనార్హం.

Anand Mahindra: ఆనంద్ మహీంద్రాకు తెగ నచ్చేసింది కానీ.. అక్కడికి వెళ్లాలంటేనే భయమేస్తోందట.. కారణమేంటంటే..!


ఈ యువతి తనకు కావలసిన వ్యక్తి ఎలా ఉండాలో పాయింట్ టూ పాయింట్ వివరించింది. అబ్బాయికి 27నుండి 40ఏళ్ళ లోపు వయసు ఉండాలని పేర్కొంది. ఈ వయసు మధ్య ఉన్న వ్యక్తి అయితే ఆమెకు సరిపోతాడట. మనిషి ఎత్తు తప్పనిసరిగా 5అడుగుల 11అంగుళాలు ఉండాలట. అంతకు మించి తక్కువగా ఉంటే ఆమెకు సమస్య ఎదురవుతుందట. కారణం ఆమె వయసు 5అడుగుల 10అంగుళాలు. 'నా ఎత్తు ఉన్నవారు అయినా నాకు సరిపోరు. నేను గతంలో ఎవరి ప్రక్కన అయినా నడిస్తే వారు హీల్స్ వేసుకోవద్దని గొడవ చేసేవారు. కాబట్టి నాకంటేఎత్తు ఉన్నవాడు కావాలి' అని చెప్పింది. ఆమె కోరుకున్న వ్యక్తికి మంచి బ్రిటీష్ హాస్యం తెలిసి ఉండాలట. చాలా సరదాగా, తనను ప్రేమగా చూసుకునేవాడు కావాలట. 'ఆటల్లోనూ, పాటల్లోనూ ప్రావీణ్యం ఉండాలి, జంతువులను, పక్షులను ప్రేమించే మనసుండాలి. ఇలాంటి వాడిని నా కోసం వెతికి పెట్టండి. అలా పెళ్శవగానే మీకు ఇలా 4లక్షలు చేతిలో పెట్టేస్తా' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం 4లక్షల బహుమతి కోసం ఈమెకు కుర్రాడిని వెతికే పనిలో ఉన్నారు చాలామంది. మరికొంత మంది మేమే పెళ్ళికి రెడీ అని అంటున్నారు.

Success Story: చదువుదేముంది బాసూ.. టాలెంట్ ఉంటే చాలని నిరూపించిన కుర్రాడు.. రూ.2463 కోట్ల వ్యాపారం వెనుక..!


Updated Date - 2023-07-14T16:50:57+05:30 IST