Home » Instagram
రీల్స్ లేదా వీడియోలను అనుకున్న విధంగా రూపొందించేందుకు ఎన్నో వ్యయప్రయాసలు పడుతుంటారు కంటెంట్ క్రియేటర్లు. నచ్చిన లొకేషన్, కాస్ట్యూమ్, బడ్జెట్ ఇలా అన్నీ సెట్ చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. ఇప్పుడు అలాంటి అవసరమే లేకుండా వినూత్న ఫీచర్ను ప్రవేశపెట్టబోతోంది.. ఇన్స్టా.. సింపుల్ టెక్ట్స్తో.. క్షణాల్లో వింత రీల్స్ ఎలా చేయవచ్చు అంటే..
ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాదిలో ఇన్స్టాగ్రామ్లో అనేక ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే వాటిలో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 పోస్టుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఐటీ కారిడార్(IT Corridor)లో శని, ఆదివారాల్లో రాత్రిళ్లు రహదారులపై కొందరు యువత ప్రమాదకర స్థితుల్లో బైక్రేస్లు చేస్తూ, స్టంట్లు కొడుతున్నారు. రేసింగ్ చేస్తూ.. బైక్లను గాలిలోకి లేపుతూ.. మంటలు పుట్టిస్తున్నారు. కొందరు అయితే అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ.. స్టాండ్లను రోడ్డుకు తాకేలా కాళ్లతో పట్టి మంటలు పుట్టేలా చేస్తున్నారు.
ఇన్స్టాగ్రామ్(Instagram)లో వీడియోలు లైక్ చేయండి.. డబ్బును తీసుకోండి అంటూ ప్రచారం చేసిన సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి సుమారు రూ.20.35లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు(City Cyber Crime Police) ఫిర్యాదు చేశాడు.
ఇకపై ఇన్స్టాగ్రామ్ను(Instagram) టీనేజర్లు విచ్చలవిడిగా ఉపయోగించలేరు. ఎందుకంటే దీనిలో కీలక మార్పులు చేశారు. ఈ క్రమంలో 18 ఏళ్లలోపు యూజర్ల కోసం మెరుగైన గోప్యత, భద్రతా ఫీచర్లను అప్గ్రేడ్ చేసింది. అంతేకాదు తల్లిదండ్రుల నియంత్రణ ఫీచర్ను కూడా ప్రవేశపెట్టింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
వాట్సప్, ఫేస్బుక్లో వినూత్న అప్డేట్లతో ఆకట్టుకుంటున్న మెటా తాజాగా ఇన్స్టాగ్రామ్లో(Instagram) కూడా సరికొత్త అప్డేట్ని తీసుకువచ్చింది.
ఇన్స్ర్టాగ్రామ్(Instagram)లో లైక్స్ కోసం ఓ యువకుడు రూ.50వేల కరెన్సీ నోట్లను గాల్లోకి విసురుతూ హల్చల్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది.
ఇన్స్టాగ్రామ్ తరహాలో స్టేట్సను లైక్ చేసే ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రకటించింది.
విడిపోయినప్పటికీ హార్ధిక్ పాండ్యా- నటాషా నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఏదో అంశం గురించి ఫ్యాన్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా నటాషాకు సంబంధించి హార్ధిక్ ఫ్యాన్స్ పోస్ట్ చేశారు. నటాషా ఇష్ట ఇష్టాలకు సంబంధించి రాసుకొచ్చారు. ఆ దంపతులు విడిపోయేందుకు కారణం ఇది అని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తితో చేసిన స్నేహం ఓ యువతి ప్రాణాలు తీసింది. ప్రేమ పేరుతో ఆ యువకుడి వేధింపులు భరించలేక ఓ బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.