Success Story: 10 ఏళ్ల వయసుకే పెళ్లి.. చేతిలో 2 రూపాయలు లేక ఇబ్బందులు పడిన ఈమే.. ఇప్పుడు ఏ రేంజ్‌లో ఉందో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-09-24T14:14:52+05:30 IST

కృషి, పట్టుదల ఉంటే బంజరు భూమిలో కూడా బంగారం పండించవచ్చని అంటుంటారు. జీవితంలో చాలా నిస్సహాయ స్థితి నుంచి కూడా ఎంతో ఎత్తుకు ఎదిగిన వారు ఉన్నారు. కష్టాలను ఎదుర్కొని ఎదిగి ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు. మహారాష్ట్రలోని విదర్భలో జన్మించిన కల్పనా సరోజ కథ కూడా అలాంటిదే.

Success Story: 10 ఏళ్ల వయసుకే పెళ్లి.. చేతిలో 2 రూపాయలు లేక ఇబ్బందులు పడిన ఈమే.. ఇప్పుడు ఏ రేంజ్‌లో ఉందో తెలిస్తే..!

కృషి, పట్టుదల ఉంటే బంజరు భూమిలో కూడా బంగారం పండించవచ్చని అంటుంటారు. జీవితంలో చాలా నిస్సహాయ స్థితి నుంచి కూడా ఎంతో ఎత్తుకు ఎదిగిన వారు ఉన్నారు. కష్టాలను ఎదుర్కొని ఎదిగి ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు. మహారాష్ట్రలోని విదర్భలో జన్మించిన కల్పనా సరోజ కథ కూడా అలాంటిదే. ఆమె బాల్యం, యవ్వనం ఎన్నో కష్టాలతో నిండింది. అయితే ఆమె తన కృషితో పైకి ఎదిగారు. నేడు కల్పన రూ.900 కోట్ల విలువైన కంపెనీని నిర్వహిస్తున్నారు. ``కమానీ ట్యూబ్స్‌`` (Kamani Tubes) చైర్‌పర్సన్‌ కల్పనా సరోజ్ (Kalpana Saroj) గురించి నేటి కథనం (Success Story).

మహారాష్ట్రలోని విదర్భలో ఓ పేద కుటుంబంలో కల్పన జన్మించింది. రెండు పూటలా భోజనం చేయడానికి కూడా కల్పన చిన్నప్పటి నుంచి పని చేయాల్సి వచ్చేది. కేవలం 10 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు కల్పన వయసులో తన కంటే 10 ఏళ్ల పెద్ద వాడైన వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కల్పన జీవనం ముంబైలోని మురికివాడకు మారింది. అత్తమామల ఇల్లు ఆమెకు బతికి ఉండగానే నరకం చూపించింది. అత్తమామలు, భర్త కల్పనను తరచుగా కొట్టేవారు. ఒకరోజు ఎలాగోలా తన అత్తమామల ఇంటి నుంచి పారిపోయి తన ఇంటికి వెళ్లిపోయింది. కల్పన చేసిన పని వల్ల ఆమె కుటుంబం మరిన్ని కష్టాలు ఎదుర్కొంది. భర్తను వదిలేసి వచ్చనిందుకు ఊరు అంతా కల్పన కుటుంబాన్ని వెలివేసింది. ఆమె ఇంటికి నీటి సరఫరాను పంచాయతీ నిలిపివేసింది (Inspirational Story).

Aparna Iyer: ఎవరీ అపర్ణ..? 20 ఏళ్ల క్రితం విప్రో కంపెనీలోనే కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె ఇప్పుడు ఏ పొజిషన్‌లో ఉన్నారంటే..!

ఎన్నో కష్టాలు పడుతున్న కల్పనకు బతికే ధైర్యం లేకుండా పోయింది. ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. 16 సంవత్సరాల వయస్సులో కల్పన మళ్లీ ముంబైకి తిరిగి వెళ్లి ఓ గార్మెంట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అక్కడ రోజుకు రూ.2 కూలీ వచ్చేది. అక్కడ పని చేస్తూనే గార్మెంట్ కంపెనీ ఎలా పని చేస్తుందో అర్థం చేసుకుంది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి కొంత డబ్బు అప్పు తీసుకుని ఓ కుట్టు మిషన్ కొనుక్కుని బట్టలు కుట్టడం ప్రారంభించింది. రోజుకు 17-18 గంటలు పనిచేసేది. తను సంపాదించిన డబ్బుతో ఆ తర్వాత ఓ ఫర్నిచర్ దుకాణం, బ్యూటీపార్లర్ తెరిచింది. లాభాలు రావడంతో ఆమె దృష్టి ``కమానీ ట్యూబ్స్`` అనే కంపెనీపై పడింది. అప్పటికే 17 ఏళ్ల క్రితం మూతపడిన ``కమానీ ట్యూబ్‌`` సంస్థను పునఃప్రారంభించాలని కార్మికులు ఆందోళన చేస్తున్నారు.

ఆ సంస్థను కల్పన దక్కించుకుని మళ్లీ పునఃప్రారంభించింది. ఆ సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చింది. ఒక కంపెనీ విజయవంతం అయ్యే వరకు దాని గురించి కష్టపడడం, లాభాల్లోకి వచ్చాక నిర్వహణ వేరే వారికి అప్పగించి, మరో కంపెనీ ప్రారంభించడం.. ఇలాగే ఎన్నో సంస్థలకు కల్పన ప్రాణం పోసింది. ఆమె పేరు ప్రస్తుతం ఎన్నో సంస్థలు విజయవంతంగా నడుస్తున్నాయి. కమానీ ట్యూబ్స్, కమాని స్టీల్స్, KS క్రియేషన్స్, కల్పనా బిల్డర్ అండ్ డెవలపర్స్, కల్పనా అసోసియేట్స్ వంటి డజన్ల కొద్దీ కంపెనీలకు కల్పన నాయకత్వం వహిస్తున్నారు.

Updated Date - 2023-09-24T14:14:52+05:30 IST