Share News

Shocking: ఒకే ఇంట్లో ఏడుగురు ఆత్మహత్య.. తెల్లారేసరికి ఇంట్లో అందరూ మరణించారని తెలిసి ఊరంతా షాక్.. అసలేం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2023-10-30T20:49:57+05:30 IST

గుజరాత్‌లో ఘోరం జరిగిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. వారిలో ముగ్గురు చిన్న పిల్లలు కూడా ఉండడం విషాదం కలిగిస్తోంది. ఈ ఘటన సూరత్‌లో జరిగింది. సూరత్‌కు చెందిన మనీష్ సోలంకీ అనే వ్యక్తి ఫర్నీచర్ వ్యాపారం చేస్తుంటాడు.

Shocking: ఒకే ఇంట్లో ఏడుగురు ఆత్మహత్య.. తెల్లారేసరికి ఇంట్లో అందరూ మరణించారని తెలిసి ఊరంతా షాక్.. అసలేం జరిగిందంటే..!

గుజరాత్‌లో (Gujarat) ఘోరం జరిగిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు (Mass suicides). వారిలో ముగ్గురు చిన్న పిల్లలు కూడా ఉండడం విషాదం కలిగిస్తోంది. ఈ ఘటన సూరత్‌ (Surat)లో జరిగింది. సూరత్‌కు చెందిన మనీష్ సోలంకీ అనే వ్యక్తి ఫర్నీచర్ వ్యాపారం చేస్తుంటాడు. అతడి దగ్గర 35 మంది కార్మికులు పని చేస్తుంటారు. శనివారం ఉదయం వారు మనీష్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించారు. అయితే ఎంతమంది ఫోన్ చేసినా మనీష్ నుంచి స్పందన రాలేదు (Crime News).

కొంత మంది ఉద్యోగులు మనీష్ ఇంటికి వెళ్లి తలుపు కొట్టారు. లోపలి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. అలాగే లోపలి నుంచి దుర్వాసన రావడం గమనించారు. కిటికీ దగ్గరకు చేరుకుని లోపలి దృశ్యం చూసి షాకైపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి చూస్తే మొత్తం ఏడుగురూ విగత జీవులుగా పడి ఉన్నారు. వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఆరుగురు విషాహారం తిని చనిపోగా, ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Viral News: 28 అకౌంట్లను ఓపెన్ చేసి.. ఏకంగా రూ.2 కోట్లు కొట్టేశాడు.. అసలేం చేశాడో తెలిసి అవాక్కైన బ్యాంకు సిబ్బంది..!

ఇంట్లో సూసైడ్ నోట్‌ను పోలీసులు కనుగొన్నారు. ఆర్థిక కష్టాల వల్లే కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు మనీష్ ఆ లేఖలో పేర్కొన్నాడు. అప్పులు తీర్చలేకే చనిపోతున్నట్టు తెలిపాడు. అప్పులు తీర్చడానికి ఫ్లాట్ అమ్మాలని నిర్ణయించుకున్నామని, అయితే ఆ ఫ్లాట్ అమ్ముడు కాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మనీష్ పేర్కొన్నాడు.

Updated Date - 2023-10-30T20:49:57+05:30 IST