Success Tips: ఎవరీ రోమన్ సైనీ..? 30 ఏళ్ల వయసుకే 25 వేల కోట్ల బిజినెస్.. అసలు ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడంటే..!
ABN , First Publish Date - 2023-07-08T16:50:23+05:30 IST
ఆ కుర్రాడు అసామాన్యుడు.. కృషితో సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు ఉన్నత లక్ష్యాలను సాధించి ఔరా అనిపించాడు.. చిన్న వయసులోనే అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు.. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు..
ఆ కుర్రాడు అసామాన్యుడు.. కృషితో సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు ఉన్నత లక్ష్యాలను సాధించి ఔరా అనిపించాడు.. చిన్న వయసులోనే అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు.. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు.. ఆ కుర్రాడు పేరు రోమన్ సైనీ (Roman Saini). ``అన్ అకాడమీ`` (Un Academy) పేరుతో ఓ స్టార్టప్‌ను ప్రారంభించి రూ.15 వేల కోట్ల కంపెనీగా అభివృద్ధి చెశాడు (Success Story).
రాజస్థాన్ (Rajasthan)కు చెందిన రోమన్ సైనీ చిన్నప్పటి నుంచే ప్రతిభావంతుడు. అనేక విషయాల్లో తన ప్రతిభను ప్రదర్శించేవాడు. 16 ఏళ్లకే ఎంతో క్లిష్టమైన ఎయిమ్స్ (AIMS) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఔరా అనిపించాడు. 21 ఏళ్ల వయసుకే ఎయిమ్స్ మెడికల్ ఎగ్జామ్స్ పాసై డాక్టర్ (MBBS) పట్టా అందుకున్నాడు. వృత్తి జీవితంలో భాగంగా అనేక పల్లెటూళ్లకు మెడికల్ క్యాంపుల కోసం వెళ్లేవాడు. ఆ సమయంలో ఆయా ప్రాంతాల్లోని ప్రజల పేదరికం చూసి చలించిపోయేవాడు. ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత, మంచి నీళ్లపై సరైన అవగాహన లేదని గుర్తించాడు. వైద్య వృత్తిలో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడం కష్టమని తెలుసుకున్నాడు. ఆరు నెలల్లోనే డాక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి యూపీఎస్‌సీ పరీక్షలకు (UPSC Exams) సన్నద్ధం కావడం ప్రారంభించాడు.
Multiple Bank Accounts: ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే నష్టం ఏముంటుందిలే అనుకుంటున్నారేమో.. ఈ విషయాలు తెలిస్తే..!
యూపీఎస్‌సీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించి 22 ఏళ్ల వయసుకే కలెక్టర్ కూడా అయిపోయాడు. అయినా రోమన్ సైనీలో మథనం ఆగలేదు. అసలు సమస్య అంతా విద్యా వ్యవస్థలోనే ఉందని రోమన్ భావించాడు. కేవలం 20 నెలలు అసిస్టెంట్ కలెక్టర్‌గా పని చేసి ఆ తర్వాత ఆ ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. మెరుగైన విద్యా వ్యవస్థను తీసుకురావాలని భావించిన రోమన్ సైనీ తన ఇద్దరు స్నేహితులు గౌరవ్ ముంజల్, హేమేశ్ సింగ్‌లతో కలిసి ఓ స్టార్టప్‌ను ప్రారంభించారు.
Ola Company: 12 ఏళ్ల క్రితం ఆయనకు జరిగిన అవమానమే.. ఓలా కంపెనీ పుట్టుకకు కారణం.. ఓలా డ్రైవర్లకూ తెలీని నిజాలివీ..!
బెంగళూరులో ``అన్ అకాడమీ`` పేరుతో ఈ స్టార్టప్‌ను మొదలు పెట్టారు. యూపీఎస్‌సీ కోచింగ్ (UPSC Coaching) తీసుకునే విద్యార్థులకు మంచి వేదికగా, ఆన్‌లైన్ ట్యుటోరియల్‌గా ``అన్ అకాడమీ``ని రూపొందించారు. కోచింగ్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా సరసమైన ధరల్లోనే శిక్షణను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొదట్లో ``అన్ అకాడమీ`` ద్వారా యూపీఎస్ కోచింగ్ మాత్రమే అందించేవారు. ప్రస్తుతం మెడికల్, ఇంజినీరింగ్, స్కూల్ ఎడ్యుకేషన్ వంటి వాటికి కూడా విస్తరించారు. ప్రస్తుతం ఈ ఎడ్‌టెక్ కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.15 వేల కోట్లకు దాటడం విశేషం.