పోలీస్ స్టేషన్‌లో పెళ్లి పంచాయితీ.. ఇద్దరిలో ఆ వరుడు ఎవరిని చేసుకోవాలన్నదానిపై ఎడతెగని చర్చ.. అసలు కథేంటంటే..!

ABN , First Publish Date - 2023-02-18T16:57:18+05:30 IST

అమ్మాయిలు దొరకడం కరువైపోయింది. అమ్మాయిలకోసం పెద్ద అన్వేషణ చేస్తుంటారు. కానీ ఇతని పరిస్థితి నారీ నారీ నడుమ మురారిలాగా తయారయ్యింది.

పోలీస్ స్టేషన్‌లో పెళ్లి పంచాయితీ.. ఇద్దరిలో ఆ వరుడు ఎవరిని చేసుకోవాలన్నదానిపై ఎడతెగని చర్చ.. అసలు కథేంటంటే..!

కొన్ని సార్లు పెళ్ళి చాలామందిని డైలమాలో పడేస్తుంది. ఇప్పటికాలంలో అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం కరువైపోయింది. అమ్మాయిలకోసం పెద్ద అన్వేషణ చేస్తుంటారు. కానీ ఇతని పరిస్థితి నారీ నారీ నడుమ మురారిలాగా తయారయ్యింది. ఇద్దరమ్మాయిల మధ్య ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో చివరికి పోలిస్ స్టేషన్ లో పంచాయితీ పెట్టారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బీహార్ రాష్ట్రం బుక్సర్ జిల్లా దుమ్రాన్ లో ఉమేష్ చౌదరి అనే వ్యక్తి ఉన్నాడు. అతని తండ్రి ముక్తి చౌదరి కొన్నేళ్ళ కిందటే చనిపోయాడు. ఉమేష్ చౌదరికి దుమ్రాన్ లోనే ఒకమ్మాయితో సంబంధం కుదిరింది, నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. రెండు కుటుంబ సభ్యలు పెళ్ళిపనుల్లో మునిగిపోయారు. పెళ్ళి పనుల్లో ఉన్న ఉమేష్ ఇంటికి పోలీసులు వచ్చారు. పెళ్ళింటికి పోలీసులు రావడంతో అందరూ కంగారు పడ్డారు. పోలీసులు ఉమేష్ ను పోలిస్ స్టేషన్ కు తీసుకెళ్ళడంతో అతని కుటుంబ సభ్యులు కూడా పోలిస్ స్టేషన్ కు చేరుకున్నారు.

Read also: Heart Touching Video: వారెవ్వా.. ఓ పెద్దాయనా.. నీకు మనస్పూర్తిగా హ్యాట్సాఫ్.. రెండు చేతులూ లేని కుర్రాడు కొనేందుకు వస్తే..


ఉమేష్ తో పాటు కుటుంబ సభ్యులు పోలిస్ స్టేషన్ కు చేరుకోగానే అక్కడ ఉమేష్ కు షాకింగ్ ట్విస్ట్ ఎదురయ్యింది. గతంలో ఉమేష్ ఇంటిపక్కనే ఉండే అమ్మాయితో అతనికి పరిచయం అయ్యింది. పరిచయం కాస్తా స్నేహంగా ఆ తరువాత అది ప్రేమకు దారితీసింది. ఆ అమ్మాయి తండ్రి ఢిల్లీలో ఉండటంతో ఆమె కూడా అక్కడికి వెళ్ళి అక్కడ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తనకు వచ్చే శాలరీలో చాలా వరకు ఆ అమ్మాయి ఉమేష్ కు పంపేది. ఉమేష్ ఆ అమ్మాయి ఇద్దరూ అన్నిరకాలుగా దగ్గరయ్యారు. కానీ ఉమేష్ వేరే అమ్మాయిని పెళ్లిచేసుకోవడానికి సిద్దపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి హడావిడిగా తన స్వగ్రామానికి చేరుకుంది. తన తల్లిని తీసుకుని పోలిస్ స్టేషన్ కు వెళ్ళి ఉమేష్ తో తనకున్న సంబంధం గురించి పోలీసులకు చెప్పింది. అయితే ఆ అమ్మాయి వయసు కేవలం 17సంవత్సరాలే కావడంతో ఉమేష్ తో ఆమె పెళ్ళికి ఇప్పుడు అవకాశం లేదని పోలీసులు తెలిపారు. వారిద్దరి పెళ్ళి జరగడానికి సంవత్సరం పాటు వెయిట్ చెయ్యకతప్పదని తెలిపారు. ఉమేష్ కూడా ప్రేమించిన అమ్మాయిని పెళ్ళిచేసుకోవడానికి అంగీకరించాడు. కానీ అతనితో సంబంధం కుదుర్చుకున్న కుటుంబం కూడా పోలిస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. పెళ్ళి కోసం మేము ఖర్చు పెట్టిన డ్బబును మాకు తిరిగి ఇప్పించండి అని వారు డిమాండ్ చేశారు. చివరికి వారికి పరిహారం ఇవ్వడానికి కూడా ఉమేష్ ఒప్పుకున్నాడు. దీంతో అన్నివైపుల నుండి సమస్య సద్దుమణిగింది. ఇద్దరు భామల మధ్య ఇరుక్కున్న ఉమేష్ ఇలా బయటపడ్డాడు.

Updated Date - 2023-02-18T16:57:21+05:30 IST