Mexican Mayor : అదృష్టం కలిసిరావాలంటూ మొసలిని పెళ్లాడిన మెక్సికన్ మేయర్
ABN , First Publish Date - 2023-07-02T13:43:29+05:30 IST
మెక్సికో దేశంలోని శాన్ పెడ్రో హువామెలుల నగర మేయర్ విక్టర్ హుగో సోస ఓ ఆడ మొసలిని పెళ్లి చేసుకున్నారు. 230 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఆచారాల ప్రకారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సంప్రదాయాన్ని పాటిస్తే సౌభాగ్యం సిద్ధిస్తుందని వీరి విశ్వాసం. అంతేకాకుండా స్థానిక సహజసిద్ధ జాతులైన ఛొంటల్, హువావె ప్రజల మధ్య శాంతి, సామరస్యాలు వర్ధిల్లుతాయని వీరు నమ్ముతారు.
న్యూఢిల్లీ : మెక్సికో దేశంలోని శాన్ పెడ్రో హువామెలుల నగర మేయర్ విక్టర్ హుగో సోస ఓ ఆడ మొసలిని పెళ్లి చేసుకున్నారు. 230 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఆచారాల ప్రకారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సంప్రదాయాన్ని పాటిస్తే సౌభాగ్యం సిద్ధిస్తుందని వీరి విశ్వాసం. అంతేకాకుండా స్థానిక సహజసిద్ధ జాతులైన ఛొంటల్, హువావె ప్రజల మధ్య శాంతి, సామరస్యాలు వర్ధిల్లుతాయని వీరు నమ్ముతారు.
ఈ విధంగా పెళ్లి చేసుకునే ఆడ మొసలిని తరతరాలుగా వస్తున్న సంప్రదాయంలోని ‘ప్రిన్సెస్ గర్ల్’కు ప్రతినిధిగా భావిస్తారు. అలిసియా అడ్రియానా అనే ఆడ మొసలిని విక్టర్ హుగో సోస పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము పరస్పరం ప్రేమించుకున్నామని, ఈ బాధ్యతను స్వీకరిస్తున్నానని చెప్పారు. ప్రేమ లేకుండా పెళ్లి ఉండదని, ప్రేమ చాలా ముఖ్యమని చెప్పారు. ప్రిన్సెస్ గర్ల్‌ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తున్నానని ఈ వివాహ కార్యక్రమంలో ఆయన చెప్పారు.
స్థానిక సహజసిద్ధ జాతులైన చొంటల్, హువావె ప్రజల మధ్య శాంతి, సామరస్యాలు వృద్ధి చెందాలనే ఆకాంక్షతో, ఈ రెండు జాతుల సంస్కృతుల సమన్వయానికి గుర్తుగా 230 సంవత్సరాల నుంచి ఈ పెళ్లి వేడుకలను నిర్వహిస్తున్నారు. భూమితో అనుబంధం పెంచుకోవడం, వర్షం కురవాలని, విత్తనాలు మొలకెత్తాలని కోరుకోవడం ద్వారా ఈ జాతులు పరస్పరం సామరస్యంగా ఉండటం కోసం ఈ కార్యక్రమం దోహదపడుతుందని స్థానికులు చెప్పారు. మత్స్యకారులు చేపల వేట బాగా జరగాలని, తమకు సంపాదన బాగుండాలని కోరుకుంటారని తెలిపారు. పెళ్లికి ముందు ఈ మొసలిని ఊరేగింపుగా అందరి ఇళ్లకు తీసుకెళ్లి, సంతోషంతో నృత్యం చేస్తారని తెలిపారు. ఈ మొసలిని కూడా అందంగా ముస్తాబు చేస్తారని తెలిపారు. తన ‘ప్రిన్సెస్ గర్ల్’ను వరుడు (మేయర్) ముద్దు పెట్టుకోవడంతో వివాహ వేడుకలు ముగిస్తాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Manipur violence : మణిపూర్ హింసాకాండ వెనుక విదేశీ శక్తులు : సీఎం బిరేన్ సింగ్
Pakistan : భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి పాకిస్థాన్ కొత్త వ్యూహాలు