Viral News: సార్.. నా కిడ్నీని అమ్మాలనుకుంటున్నా.. ఓ బాలుడి మాటలు విని అవాక్కైన డాక్టర్.. అతడి కథంతా విని చలించిపోయి..!

ABN , First Publish Date - 2023-05-17T16:32:52+05:30 IST

ఆ కుర్రాడి వయసు 13 ఏళ్లు.. బీహార్‌లోని గయా జిల్లాకు చెందిన ఆ కుర్రాడి పేరు దీపాంశ్. అతడి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి కూలి పనులకు వెళుతూ ఈ కుర్రాడిని చదివిస్తోంది. నెల రోజుల క్రితం ఆ తల్లి ఓ రోడ్డు ప్రమాదానికి గురై కాళ్లు పోగొట్టుకుంది.

Viral News: సార్.. నా కిడ్నీని అమ్మాలనుకుంటున్నా.. ఓ బాలుడి మాటలు విని అవాక్కైన డాక్టర్.. అతడి కథంతా విని చలించిపోయి..!

ఆ కుర్రాడి వయసు 13 ఏళ్లు.. బీహార్‌లోని (Bihar) గయా జిల్లాకు చెందిన ఆ కుర్రాడి పేరు దీపాంశ్. అతడి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి కూలి పనులకు వెళుతూ ఈ కుర్రాడిని చదివిస్తోంది. నెల రోజుల క్రితం ఆ తల్లి (Mother) ఓ రోడ్డు ప్రమాదానికి గురై కాళ్లు పోగొట్టుకుంది. ఆమె కాళ్లు బాగుపడాలంటే ఆపరేషన్ చేయించాలి. ఆ కుర్రాడిది పేద కుటుంబం. అండగా నిలబడేవాళ్లు ఎవరూ లేరు. దీంతో ఆ కుర్రాడు తన తల్లి కోసం తన జీవితాన్ని పణంగా పెట్టాడు. తన కిడ్నీ (Kidney) అమ్ముకుని అయినా సరే తల్లిని కాపాడాలనుకున్నాడు.

దీపాంశ్ రాంచీలోని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ తన కిడ్నీని విక్రయించడానికి ప్రయత్నించాడు. ఓ వ్యక్తితో బేరం కుదుర్చుకున్నాడు. దీపాంశ్‌ను ఆ వ్యక్తి రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ డాక్టర్ వికాస్‌కు పరిచయం చేశాడు. మైనర్ బాలుడు కిడ్నీ ఇస్తానని చెప్పడం డాక్టర్‌కు షాక్ కలిగించింది. డాక్టర్ ఆరా తీయగా.. దీపాంశ్ తన విచారకర కథను చెప్పాడు. దీపాంశ్ కన్నీటి గాథకు చలించిపోయిన వికాస్ అతడి తల్లికి ఉచితంగా ఆపరేషన్ చేసేందుకు సిద్ధపడ్డారు.

Uber Auto: ఉబెర్ ఆటోను బుక్ చేసుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఊహించని షాక్.. డ్రైవర్ వస్తానన్నాడు కానీ..!

దీపాంశ్ తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఐదో తరగతి వరకు చదువుకున్న దీపాంశ్ తల్లికి అండగా నిలబడాలనే కోరికతో చదువు మానేసి రాంచీ వెళ్లి అక్కడ ఓ హోటల్‌లో సర్వర్‌గా చేరాడు. ప్రతినెల తల్లికి డబ్బులు పంపించేవాడు. నెల రోజుల క్రితం తల్లి ప్రమాదానికి గురి కావడంతో ఆమెకు చికిత్స చేయించేందుకు తన కిడ్నీని అమ్ముకోవాలని నిర్ణయించుకున్నాడు. డాక్టర్ వికాస్ మంచి మనసు కారణంగా కిడ్నీ అమ్మకుండా దీపాంశ్ తల్లికి చికిత్స అందుతోంది.

Updated Date - 2023-05-17T16:32:52+05:30 IST