Shocking: అమ్మకానికి అమ్మాయిలు.. కన్నతల్లిదండ్రులతోనే బేరాలు.. స్టింగ్ ఆపరేషన్‌లో వెలుగులోకి విస్తుపోయే నిజాలు..!
ABN , First Publish Date - 2023-09-29T15:40:35+05:30 IST
పేదరికంతో అల్లాడేవారు పొట్ట కూటి కోసం రకరకాల పాట్లు పడుతుంటారు. కష్టపడి తమ కుటుంబాలను పోషించుకుంటారు. అలా కష్టపడ లేని కొద్ది మంది డబ్బుల కోసం కొన్ని తప్పుడు పనులు చేస్తుంటారు. కడుపు నింపుకోవడానికి కన్నపేగును కూడా అమ్మకానికి పెడుతుంటారు.
పేదరికంతో అల్లాడేవారు పొట్ట కూటి కోసం రకరకాల పాట్లు పడుతుంటారు. కష్టపడి తమ కుటుంబాలను పోషించుకుంటారు. అలా కష్టపడ లేని కొద్ది మంది డబ్బుల కోసం కొన్ని తప్పుడు పనులు చేస్తుంటారు. కడుపు నింపుకోవడానికి కన్నపేగును కూడా అమ్మకానికి పెడుతుంటారు. ఇటీవలి కాలంలో రాజస్థాన్ (Rajasthan), మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయి. కొన్ని లక్షల రూపాయలకు అమ్మాయిలను (Selling Girls) అమ్మేస్తున్న ఘటనలు ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా జరిగిన ఓ స్టింగ్ ఆపరేషన్‌లో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి (Crime News).
ఓ మీడియా బృందం రాజస్థాన్‌లో నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ (Sting Operation) సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన నిజాలను వెలుగులోకి తీసుకొచ్చింది. 13, 14 ఏళ్ల ఆడ పిల్లలను డబ్బు కోసం తల్లిదండ్రులే అమ్ముకుంటున్న ఘటనలు బయటకు వచ్చాయి. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ తన 14 ఏళ్ల కూతురిని రూ.3 లక్షలకు అద్దెకు ఇచ్చింది. ఆ డబ్బుతో ఇల్లు కట్టుకోవాలని ఆమె ప్లాన్. అలాగే మరో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇద్దరు మేనకోడళ్లను రూ.7 లక్షలకు వేలం వేశాడు. రాజస్థాన్‌లోని పలు నగరాల్లో ఉన్న హోటళ్లలో డ్యాన్స్‌లు వేయడానికి పంపిస్తామని అమ్మాయిలకు చెబుతారు.
వారిని ఉత్తర భారతదేశంలోని పలు నగరాలకు తరలించి బలవంతంగా వేశ్యా గృహాలకు తరలిస్తారు. అక్కడ వారిని ఉపయోగించుకుని విపరీతంగా సంపాదిస్తారు. కాంట్రాక్టు అయిపోయాక ఆ అమ్మాయిలను మళ్లీ ఇళ్లకు పంపిస్తారు. లఖన్ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఎంతో మంది అమ్మాయిల తల్లిదండ్రులతో ఇలాంటి కాంట్రాక్టులకు కుదుర్చుకున్నాడు. బాగా పేదరికంలో ఉన్న కుటుంబాలనే ఈ లఖన్ టార్గెట్ చేస్తాడు. వారికి డబ్బు ఆశ చూపించి అమ్మాయిలను వేశ్యా గృహాలకు తరలిస్తుంటాడు. తాజగా బయటపడిన ఈ స్టింగ్ ఆపరేషన్ స్థానికంగా సంచలనంగా మారింది.