Monkey in Bus: రూపాయి ఖర్చు లేకుండా 30 కిలోమీటర్ల జర్నీ.. హాయిగా విండో సీట్లో కూర్చుని మరీ ఎంజాయ్ చేసిన కోతి..!

ABN , First Publish Date - 2023-10-06T19:11:11+05:30 IST

కర్ణాటకలో ఓ కోతి 30 కిలోమీటర్ల మేర బస్సులో ప్రయాణించింది. ప్రయాణికులతో కిక్కిరిసిన బస్సులో అది కిటికీ పక్కన సీటులో కూర్చుని మరీ దర్జాగా ప్రయాణించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Monkey in Bus: రూపాయి ఖర్చు లేకుండా 30 కిలోమీటర్ల జర్నీ.. హాయిగా విండో సీట్లో కూర్చుని మరీ ఎంజాయ్ చేసిన కోతి..!

ఇంటర్నెట్ డెస్క్: మానవుడు తన అవసరాల కోసం ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు. కొండలు, గుట్టలు మాయమైపోతున్నాయి. అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. దీంతో, అడవుల్లోని పులులు, కోతులు వంటివి జనావాసాల్లోకి వచ్చి కలకలం రేపుతున్నాయి. ఇక కోతులు అయితే మనిషికి ఉనికికి అలవాటు పడిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా(Viral Video) మారింది. ఓ ఆడ కోతి అచ్చుమనుషుల్లాగానే బస్సు ప్రయాణం చేయడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

కర్ణాటకలోని హవేరీ(Haveri) జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. ఓ కోతి హవేరీ బస్‌స్టాండ్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని హంసబావి వరకూ బస్సులో దర్జాజా ప్రయాణించింది. ప్రయాణమంటే బస్సు టాపును పట్టుకుని వేళాడుతూ వెళ్లడం కాదు. సాధారణ ప్రయాణికుల్లా దర్జాగా సీటులో కూర్చుని మరీ ప్రయాణించింది. అప్పటికే బస్సు జనాలతో కిక్కిరిసిపోయింది.


అయినా ,కోతికి మాత్రం విండో సీటు దొరకడంతో అది జర్నీని తెగ ఎంజాయ్ చేసింది. అప్పుడప్పుడూ కిటీలోంచి తొంగి చూస్తూ, వచ్చే పోయేవారిని గమనిస్తూ ప్రయాణించింది. బస్సులో అంత మంది ఉన్నా కూడా అది భయపడలేదు. తొలుత సీటు బ్యాక్‌రెస్ట్‌పై కూర్చున్న ఓ కోతి ఆ తరువాత దర్జాగా సీటులో కూలబడి ప్రయాణించింది. ఆ తరువాత హంసబావి వద్దకు బస్సు వచ్చాక దిగిపోయింది(Monkey travels by bus for 30 km in haveri district in karnataka).

ఈ ఉదంతాన్ని బస్సులోని వ్యక్తి ఒకరు సెల్‌ఫోన్‌లో బంధించి నెట్టింట పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. వీడియో చూసిన వారు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కోతి తీరు చూసి ఆశ్చర్యపోతున్నారు.

Updated Date - 2023-10-06T19:51:20+05:30 IST