Shocking: ఏంటీ దారుణం.. కుప్పలు కుప్పలుగా పడి ఉన్న కోతుల కళేబరాలు.. చంపేసి.. అన్నిటినీ ఒకే చోట పడేశారు..!
ABN , First Publish Date - 2023-10-06T14:48:06+05:30 IST
అడవులను కొట్టేయడం, ప్రకృతి వనరులను విచ్చలవిడిగా నాశనం చేస్తుండడంతో వన్య ప్రాణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తినడానికి తిండి లేక, ఉండడానికి ఆవాసం లేక ఆపసోపాలు పడుతున్నాయి. ఆహారం కోసం జనావాసాల వైపు వచ్చేస్తున్నాయి.
అడవులను కొట్టేయడం, ప్రకృతి వనరులను విచ్చలవిడిగా నాశనం చేస్తుండడంతో వన్య ప్రాణులు (Wild Animals) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తినడానికి తిండి లేక, ఉండడానికి ఆవాసం లేక ఆపసోపాలు పడుతున్నాయి. ఆహారం కోసం జనావాసాల వైపు వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాకుండా అన్ని జనావాస ప్రాంతాల్లోనూ కోతుల (Monkeys) సంచారం పెరిగిపోయింది. ఆహారం కోసం వానరాలు గ్రామాల వైపు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోతుల బెడద తట్టుకోలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని బహ్రెయిన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో 50 కోతులను చంపి, మృతదేహాలను ఫారెస్ట్ పోస్ట్ సమీపంలో విసిరిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కోతులను ఎప్పుడు, ఎవరు చంపారో ఇంకా తెలియరాలేదు (Monkeys were killed). కోతుల మృత దేహాల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే అటవీ శాఖ రంగంలోకి దిగింది. ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే పట్టుకుని అరెస్ట్ చేస్తామని తెలిపింది.
తాజాగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. దాదాపు 35 కోతులకు విషం పెట్టి చంపేశారు. స్థానికంగా మైనింగ్ కారణంగా కొండలు కనుమరుగైపోవడంతో కోతులు గ్రామాలపై పడుతున్నాయని, ఈ క్రమంలోనే ఆగంతుకులు వాటిని విషప్రయోగంతో మట్టుబెట్టి ఉండొచ్చని స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.