అవి ధనవంతులు నివాసముండే నగరాలు... ఎక్కడెక్కడున్నాయి? ఎంతమంది ఉన్నారో తెలిస్తే...

ABN , First Publish Date - 2023-04-23T11:21:54+05:30 IST

ప్రపంచంలోని ధనవంతులు ఏం చేసినా అది చర్చనీయాంశంగా మారుతుంటుంది. అయితే ప్రపంచం(world)లో అత్యధిక ధనవంతులు ఏ నగరంలో ఉన్నారో మీకు తెలుసా?

అవి ధనవంతులు నివాసముండే నగరాలు... ఎక్కడెక్కడున్నాయి? ఎంతమంది ఉన్నారో తెలిస్తే...

ప్రపంచంలోని ధనవంతులు ఏం చేసినా అది చర్చనీయాంశంగా మారుతుంటుంది. అయితే ప్రపంచం(world)లో అత్యధిక ధనవంతులు ఏ నగరంలో ఉన్నారో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జర్మన్ వార్తా వెబ్‌సైట్ DWలో ప్రచురితమైన వివరాల ప్రకారం 2022, డిసెంబరు 31న విడుదల చేసిన గణాంకాల ప్రకారం(According to statistics) ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు USకు చెందిన ఒక నగరంలో నివసిస్తున్నారు.

ఈ నగరంలో మొత్తం 3,40,000 మంది బిలియనీర్లు(Billionaires) నివసిస్తున్నారు.. అదే న్యూయార్క్‌. ఇక్కడ 58 ట్రిలియనీర్లు కూడా ఉంటున్నారు. అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని అమెరికా ఆర్థిక రాజధాని(America's financial capital) అని కూడా అంటారు. ఇక ఆ తరువాతి స్థానంలో జపాన్(Japan) రెండవ రాజధాని టోక్యో వస్తుంది. ఈ నగరంలో మొత్తం 2,90,000 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. ఈ జాబితాలో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో(San Francisco), సిలికాన్ వ్యాలీ కూడా ఉన్నాయి.

శాన్ ఫ్రాన్సిస్కోలో 2,85,000 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. సింగపూర్(Singapore) నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ మొత్తం 2,40,100 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. ట్రిలియనీర్ల సంఖ్య ఇక్కడ 27. కాగా లాస్ ఏంజిల్స్(Los Angeles) ఐదవ స్థానంలో ఉంది. 2,05,000 మంది బిలియనీర్లు ఇక్కడ నివసిస్తున్నారు. అమెరికాలోని ఈ నగరంలో దాదాపు 42 మంది ట్రిలియనీర్లు(Trillionaires) ఉంటున్నారు. ఆ నివేదిక ప్రకారం ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో UK నగరమైన లండన్(London) నాల్గవ స్థానంలో ఉంది. ఇక్కడ 2,72,400 మంది మిలియనీర్లు నివసిస్తున్నారు.

Updated Date - 2023-04-23T12:08:27+05:30 IST