Mangoes: అత్యంత ఖరీదైన మామిడి పండ్లు... వాటి ధర చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..!

ABN , First Publish Date - 2023-06-25T15:28:06+05:30 IST

వేసవి సీజన్‌ ఆరంభంలో మామిడి పళ్ల ధర కిలో వంద రూపాయలు దాటినా... చినుకులు పడే వేళకు ధర 30 రూపాయలకు పడిపోతుంది. తీరొక్క మామిడి పండు... తీపిలో దేని గొప్ప దానిదే. అయితే అత్యంత ఖరీదైన మామిడిపళ్లు ఏమిటో తెలుసా

Mangoes: అత్యంత ఖరీదైన మామిడి పండ్లు... వాటి ధర చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..!

వేసవి సీజన్‌ ఆరంభంలో మామిడి పళ్ల ధర కిలో వంద రూపాయలు దాటినా... చినుకులు పడే వేళకు ధర 30 రూపాయలకు పడిపోతుంది. తీరొక్క మామిడి పండు... తీపిలో దేని గొప్ప దానిదే. అయితే అత్యంత ఖరీదైన మామిడిపళ్లు ఏమిటో తెలుసా? వాటి ధర ఎంతుంటుందో తెలుసా? ‘ఏ రకం ధర అయినా కిలోకు మహా అయితే రెండు, మూడు వందలు’ అనుకుంటే మీరు మ్యాంగ్‌ జ్యూస్‌లో కాలేసినట్లే.

మోడల్లా కేర్‌టేకర్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి జిల్లాలో ఉన్న మాటిగరా మాల్‌లో ప్రతీ ఏడాది మ్యాంగో ఫెస్టివల్‌ జరుగు తుంది. ఈ ఏడాది నిర్వహించిన 7వ ఎడిషన్‌లో 262 రకాల మామిడిపండ్లను ప్రదర్శనకుఉంచగా... వాటిలో ‘మియాజాకి’ రకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండుగా పేరుగాంచిన ఈ రకాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. ఒక్కో పండు బరువు 350 గ్రాముల నుంచి 900 గ్రాముల వరకు ఉంటుంది. ఇంతకీ ఈ మ్యాంగో కిలో ధర ఎంతను కుంటున్నారు? అక్షరాలా రూ. 2.75 లక్షలు. ఇంత ఖరీదైన మామిడి పండ్ల గురించి తెలుసుకుని నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. ‘ఎగ్జిబిషన్‌కి తెచ్చిన పండ్లకు రక్షణ కల్పించండి... లేదంటే ఎవరైనా ఎత్తుకుపోవచ్చు’, ‘ఈ పండ్ల ఖరీదు ముందు బంగారం కూడా వెలవెల పోతుంది కదా’ అంటూ పలువురు తమదైన శైలిలో సరదాగా ట్వీట్‌లు పెడుతున్నారు.

Updated Date - 2023-06-25T15:43:57+05:30 IST