Shocking Incident: ఇలాంటి చావు పగోడికి కూడా రాకూడదు తల్లీ.. 20 రోజుల క్రితమే తల్లి చనిపోయిందని ఆ కొడుక్కు తెలియక..!
ABN , First Publish Date - 2023-04-06T09:00:40+05:30 IST
గ్రేటర్ నోయిడాలో (Greater Noida) షాకింగ్ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: గ్రేటర్ నోయిడాలో (Greater Noida) షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కొడుకు (Son) కోసం ఎదురుచూసి ఆ తల్లి గుండె ఆగింది. కానీ, కుమారుడు రాలేదు. అలా 20 రోజులు గడిచిపోయాయి. అప్పుడు వచ్చిన కొడుకుకు.. ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న తల్లి మృతదేహం కనిపించింది. మృతదేహానికి పురుగులు కూడా పట్టేశాయి. అప్పడప్పుడు అంటుంటారుగా ఇలాంటి చావు పగోడికి కూడా రాకూడదని.. పాపం ఈ తల్లీ విషయంలో అదే జరిగిందన్నమాట.
వివరాల్లోకి వెళ్తే.. గ్రేటర్ నోయిడా పరిధిలోని బెటా-01 సెక్టార్‌లో అమియా సిన్హా(70) అనే వృద్ధురాలు నివాసం ఉంటుంది. ఆమె వైద్యురాలిగా చేసి రిటైర్ అయ్యారు. భర్తతో విడాకులు తీసుకున్న ఆమె గత 15 ఏళ్లుగా ఒంటరిగానే ఉంటోంది. ఆమె కుమారుడు ప్రణవ్ రంజన్ సిన్హా నోయిడాకు సమీపంలోని ఘజియాబాద్‌లో ఉంటాడు. అప్పడప్పుడు వచ్చి తల్లిని చూపిపోయేవాడు. అయితే, తన ఉద్యోగం రీత్యా పని ఒత్తిడితో గడిచిన నాలుగు నెలలుగా తల్లిని చూడటానికి ప్రణవ్ రాలేదు. కానీ, ఫోన్ చేసి మాట్లాతుండేవాడు. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా ఆమె ఫోన్ స్వీచ్చాఫ్ వస్తోంది. దాంతో అనుమానం వచ్చి సోమవారం ఉదయం తల్లి నివాసానికి వచ్చాడు.
US: అగ్రరాజ్యం అధ్యక్షుల అఫైర్స్.. అప్పుడు వైట్‌హౌస్ ఉద్యోగినితో బిల్ క్లింటన్.. ఇప్పుడు పోర్న్ స్టార్‌తో ట్రంప్..!
ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. లోపలి నుంచి గడియా పెట్టి ఉండడంతో చాలాసేపు తలుపులు తట్టాడు. కానీ, ఎంతకీ తల్లి తలుపు తీయలేదు. దాంతో ఇంటి కిటికీలు తెరిచాడు. అంతే.. ఒక్కసారిగా భరించలేని దుర్వాసన వచ్చింది. వెంటనే తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూస్తే బెడ్‌పై తల్లి మృతదేహం కనిపించింది. మొత్తం కుళ్లిపోయి, పురుగులు పట్టి ఉండడం చూసి ప్రణవ్ చలించిపోయాడు. అక్కడికి చేరుకున్న బెటా-02 సెక్టార్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చెప్పిన దాని ప్రకారం అమీయా దాదాపు 20 రోజుల క్రితం చనిపోయి ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
Work Visa Rules: విదేశీయులను ఆకర్షించేందుకు డెన్మార్క్ మాస్టర్ ప్లాన్.. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!