Mother: 14వ అంతస్తులోంచి 40 రోజుల బిడ్డను కిందకు పారేసిందో తల్లి.. విచారణ చేసేందుకు పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లి చూస్తే..!
ABN , First Publish Date - 2023-09-27T15:39:08+05:30 IST
ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు మించింది ఏదీ లేదు అంటారు. పిల్లల సంరక్షణ కోసం తల్లి తన ప్రాణాలను సైతం అర్పిస్తుంది అంటారు. అయితే ముంబైలోని ఓ మహిళ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. కన్న కూతురిని ఆమె అత్యంత కర్కశంగా చంపేసింది.
ఈ ప్రపంచంలో తల్లి (Mother) ప్రేమకు మించింది ఏదీ లేదు అంటారు. పిల్లల సంరక్షణ కోసం తల్లి తన ప్రాణాలను సైతం అర్పిస్తుంది అంటారు. అయితే ముంబై (Mumbai)లోని ఓ మహిళ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. కన్న కూతురిని ఆమె అత్యంత కర్కశంగా చంపేసింది (Mother killed Daughter). 39 రోజుల క్రితం పుట్టిన పసిపాపను 14వ అంతస్థు కిటికీ నుంచి కిందకు విసిరేసింది. ఆ పాప హాస్పిటల్‌కు తీసుకెళ్లే లోపే చనిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు వెళితే అసలు విషయం బయటపడింది (Crime News).
ముంబైలోని జెవార్ రోడ్‌లోని ఓ సొసైటీలో నివసిస్తున్న ఓ మహిళ తీవ్ర ఆగ్రహానికి గురై 39 రోజుల కూతురిని గురువారం సాయంత్రం కిటికీలోంచి కింద పడేసింది. వెంటనే బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పాప తల్లిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. అయితే ఆమెను ఇంకా అరెస్టు చేయలేదు. ఆ పాపను చంపిన తల్లి చాలా రోజులుగా తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతోంది.
Wife-Husband: శోభనం గదిలో భర్త వింత నిర్వాకం.. ఛీ కొట్టి పుట్టింటికి వెళ్లిన భార్య.. పోలీసుల వద్దకు పంచాయితీ.. చివరకు..!
కోపం వస్తే ఆ మహిళ ఏం చేస్తుందో ఆమెకే అర్థం కాదు. ఆ మానసిక సమస్యకు అమె ప్రస్తుతం చికిత్స కూడా అందుకుంటోంది. ఆమె ఎవరితోనూ మాట్లాడదు. ఎవరూ చెప్పేది వినదు. దీంతో పోలీసులు ఆమెను విచారించలేకపోతున్నారు. ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకుని కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.