Viral: కాపురాలు ఎలా కూలుతున్నాయో చెప్పిన మహిళ..! ప్చ్..ఇది నిజంగా బ్యాడ్ న్యూసే!
ABN , First Publish Date - 2023-10-15T16:50:54+05:30 IST
ప్రస్తుతం యువత ఎలాంటి కారణాలతో విడాకులకు వస్తున్నారో చెబుతూ ఓ మహిళా లాయర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో వివాహమంటే అడామగా మధ్య ఓ పవిత్ర బంధం. వ్యక్తులను, వ్యవస్థలను నిలబెట్టే ఓ మూల స్తంభం. కాబట్టి.. ఆలుమగలూ తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటే ఇంట్లోనూ, సమాజంలోనూ సంతోషం వెల్లివిరుస్తుంది! కానీ, ఆధునిక సమాజంలో వివాహ వ్యవస్థలోనూ మార్పులు వస్తున్నాయి. నేటి యువత మాత్రం తమ స్వేచ్ఛాగౌరవాలకు ప్రాధాన్యమిస్తున్నారు. వాటికి ఇబ్బంది కలిగిన సందర్భాల్లో యువజంటలు విడిపోయేందుకు ఏమాత్రం సంకోచించడం లేదు. అయితే, కొన్ని యువ జంటలు ఎలాంటి కారణాలతో విడాకుల కోసం కోర్టుకెక్కుతున్నాయో చెబుతూ ముంబైకి చెందిన ఓ మహిళ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా(Viral Video) మారింది. ఈ మహిళ స్వయంగా లాయర్ కావడంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది(Mumbai lawyers reason bizarre reasons for divorces).
Viral Video: ప్రాణాలకు తెగించి తోబుట్టువులను కాపాడిన టీనేజ్ మగ సింహం..ఇప్పుడే ఇలా ఉందంటే..
ఈ ముంబై లాయర్ చెప్పిన వివరాల ప్రకారం.. హనీమూన్‌లో భార్య వల్గర్ దుస్తులు ధరించినందుకు ఓ వ్యక్తి విడాకులు కోరాడు. మరో కేసులో భార్యకు వంట రాకపోవడం భర్తకు చికాకు తెప్పించింది. రోజూ ఖాళీ కడుపుతో ఆఫీసుకు వెళుతున్నానని, కాబట్టి తనకు విడాకులు ఇప్పించండి కోర్టును ఆశ్రయించాడు. ఓ ముఖ్య వేడుకలో తనకు భార్య పాదనమస్కారం చేయలేదంటూ మరో వ్యక్తి డైవర్స్ కోసం కోర్టు మెట్లెక్కాడు.
ఇక పురుషులకు తామేమీ తీసిపోమనట్టు మహిళలు కూడా వింత కారణాలతో డైవర్స్‌కు సిద్ధమవుతున్నారు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న భర్త తనకు తగిన సమయం ఇవ్వట్లేదని ఓ మహిళ విడిపోయేందుకు డిసైడ్ అయ్యింది. తనపై భర్త కురిపిస్తున్న అతి ప్రేమతో ఉక్కిరిబిక్కిరవుతూ మరో మహిళ డైవర్స్ కావాలనుకుంది. భర్త గురకతో మరో మహిళకు వివాహంపై విరక్తి పుట్టిందని లాయర్ చెప్పుకొచ్చారు.
Viral: ఇంటి పనుల్లో భార్యకు సాయం చేయనన్న వ్యక్తిపై ప్రశంసల వర్షం.. ఇతడి లాజిక్కు జనాలు ఫిదా!
ఈ వీడియో చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున రియాక్టవుతున్నారు. మన దేశంలో వివాహ వ్యవస్థకు ఏమైంది. ఇలా అయితే కష్టమే అంటూ కొందరు కామెంట్ చేశారు. భర్తలు తమ పురుషాధిక్య భావజాలం వదులుకోలేకే విడాకులు పెరుగుతున్నాయని కొందరు కామెంట్ చేశారు. సిల్లీ కారణాలతో విడాకులు కోరడం ఆశ్చర్యంగా ఉందని అనేక మంది అభిప్రాయపడ్డారు. అయితే, పెళ్లికి ముందే యువతీయువకులను ప్రీమేరిటల్ కౌన్సెలింగ్ ఇస్తే సమస్య కొంత వరకూ పరిష్కారమవుతుందని కొందరు చెప్పుకొచ్చారు.
Sundar Pichai: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం.. గూగుల్ సీఈఓకు హెచ్చరిక..!