Viral: కోడల్ని రాచిరంపాన పెట్టే అత్తలున్న ఈ రోజుల్లో కూడా ఇలాంటోళ్లు ఉంటారా..? కొడుకు భార్య కోసం ఆ తల్లి ఏం చేసిందో తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-08-07T19:23:51+05:30 IST
సాధారణంగా ఏ ఇంట్లో అయినా అత్తాకోడళ్లు అంటే టామ్ అండ్ జెర్రీ టైపు. ఒకరితో ఒకరికి పడదు. ఏ కారణం లేకపోయినా తరచుగా గొడవపడుతుంటారు. అలాంటిది ముంబైకి చెందిన ఓ మహిళ తన కోడలికి కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చింది.
సాధారణంగా ఏ ఇంట్లో అయినా అత్తాకోడళ్లు అంటే టామ్ అండ్ జెర్రీ టైపు. ఒకరితో ఒకరికి పడదు. ఏ కారణం లేకపోయినా తరచుగా గొడవపడుతుంటారు. అలాంటిది ముంబై (Mumbai)కి చెందిన ఓ మహిళ తన కోడలి (Daughter-in-law)కి కిడ్నీ (Kidney) దానం చేయడానికి ముందుకు వచ్చింది. సాధారణంగా కొడుకు లేదా కూతురికి, తల్లిదండ్రులకు మాత్రమే ఎవరైనా కిడ్నీ దానం చేస్తారు. కోడలికి అత్త (Mother-in-law) కిడ్నీ దానం చేయడం అనేది చాలా అరుదైన ఘటనే అని చెప్పాలి. ఆమె త్యాగాన్ని స్థానిక రాజకీయ నాయకుడు కూడా ప్రశంసించడం గమనార్హం.
మహారాష్ట్రలోని ముంబైకి చెందిన అమీషా అనే మహిళ గతేడాది కిడ్నీ సంబంధిత వ్యాధికి గురైంది. వెంటనే కిడ్నీ మార్పిడి చేయించుకోవాలని డాక్టర్ చెప్పారు. షాకైన అమీషా ఇంటికెళ్లి ఏడుస్తూ కూర్చుంది. కోడలి బాధ చూడలేకపోయిన అత్త ప్రభా మోతా తన కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రభకు అన్నీ పరీక్షలు చేసి ఆమె కిడ్నీ అమీషాకు సరిపోతుందని డాక్టర్లు తేల్చారు. ఇటీవల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇద్దరూ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు (woman donates kidney to Daughter-in-law).
Wife-Husband: భార్య సడన్‌గా అడిగిన ప్రశ్నతో.. చిక్కుల్లో పడిన భర్త.. ట్విటర్ పేరు మార్పుతో మగాళ్లకు వింత కష్టాలు..!
``నా కోడలు ఏడుస్తుంటే చూడలేకపోయాను. ఆమెకు ఎలాగైనా సహాయం చేయాలనుకున్నా. దేవుడి దయ వల్ల నా కిడ్నీ ఆమెకు సరిపోయింద``ని ప్రభ పేర్కొన్నారు. ``మా అమ్మ నాకు జన్మనిస్తే మా అత్తయ్య పునర్జన్మను ఇచ్చార``ని అమీషా తెలిపింది. కోడలి కోసం అత్త తన కిడ్నీని దానం చేసిందనే వార్త (Viral News) చర్చనీయాంశంగా మారింది.