Viral: ఆ ఇంటి సభ్యులు దేశం దాటాలనుకుంటే జస్ట్ బెడ్‌రూమ్‌లోకి వెళితే చాలు.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన నాగాలాండ్ మంత్రి!
ABN , First Publish Date - 2023-01-13T17:56:47+05:30 IST
నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా (Nagaland minister Temjen Imna) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తమ రాష్ట్రానికి సంబంధించిన ఆసక్తికర వీడియోలను, ప్రకృతి దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా (Nagaland minister Temjen Imna) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తమ రాష్ట్రానికి సంబంధించిన ఆసక్తికర వీడియోలను, ప్రకృతి దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగాలాండ్‌లోని మోన్‌జిల్లాలో ఉన్న అతిపెద్ద గ్రామాల్లో లాంగ్వా (Longwa village) ఒకటి. నాగాలాండ్ రాజధాని కొహిమాకు 380 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది.
భారత్-మయన్మార్ సరిహద్దుల్లో (India-Myanmar border) ఉండే ఈ లాంగ్వా గ్రామంలో కొన్యాక్ నాగా తెగకు చెందిన వారే అధికంగా ఉంటారు. ఈ తెగకు చెందిన ఆంగ్ అనే వ్యక్తి నివసించే ఇల్లు ఇండియా మయన్మార్ దేశాలను వేరు చేస్తుంది. అంటే ఆ ఇంట్లోని కిచెన్ మయన్మార్‌లో ఉంటే.. బెడ్‌రూమ్ మాత్రం భారత్‌లో ఉండటం విశేషం. ఆ ఇంటికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన టెమ్‌జెన్.. ఓ మై గాడ్.. దేశ సరిహద్దును దాటాలంటే ఈ వ్యక్తి తన ఇంటి కిచెన్ నుంచి బెడ్రూమ్‌లోకి వెళితే చాలు. ఆ ఇంటి సభ్యులు భారత్‌లో నిద్రపోతారు, మయన్మార్‌లో తింటారు
(Sleeping in India and Eating in Myanmar) అని కామెంట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.