Dasara: నాని ఊర మాస్ బ్యాటింగ్.. కొడితే సిక్సే!

ABN , First Publish Date - 2023-02-24T18:05:02+05:30 IST

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) పుట్టినరోజు సందర్భంగా ‘దసరా’ (Dasara) చిత్రం నుంచి గ్లింప్స్, మాస్ అప్పీలింగ్ పోస్టర్‌‌ను మేకర్స్ విడుదల చేశారు. నాని పుట్టినరోజు(HappyBirthdayNani) ను

Dasara: నాని ఊర మాస్ బ్యాటింగ్.. కొడితే సిక్సే!
Nani in Dasara Movie

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) పుట్టినరోజు సందర్భంగా ‘దసరా’ (Dasara) చిత్రం నుంచి గ్లింప్స్, మాస్ అప్పీలింగ్ పోస్టర్‌‌ను మేకర్స్ విడుదల చేశారు. నాని పుట్టినరోజు(HappyBirthdayNani) ను పురస్కరించుకుని.. సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు.. ఉదయం నుంచి సోషల్ మీడియాలో చెబుతున్న శుభాకాంక్షలతో ఆయన పేరు ట్రెండ్ అవుతోంది. ఇదే సందర్భంగా నాని పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ మేకర్స్ మాస్ అప్పీలింగ్ పోస్టర్‌‌తో పాటు.. చిత్ర గ్లింప్స్ వీడియోని కూడా వదిలారు. ఈ పోస్టర్‌లో లుంగీ కట్టుకున్న నాని.. కళ్ళజోడు ధరించి బీడీ తాగుతూ నడిచొస్తుంటే.. ఊర మాస్‌కి (Nani Mass Look) కేరాఫ్ అడ్రస్‌గా కనబడుతున్నారు. ధరణిని ఘనంగా స్వాగతిస్తున్న డప్పు దరువులు కూడా పోస్టర్‌లో అలరిస్తున్నాయి.

అలాగే గ్లింప్స్ వీడియోలో ధరణిగా నాని ఆడిన ఊర మాస్‌ క్రికెట్ షాట్ (Cricket) మెస్మరైజ్ చేస్తోంది. లుంగీ కట్టుకొని బీడీ తాగుతూ.. క్రీజ్‌లో బ్యాట్ పట్టుకొని బాల్ కోసం ఎదురుచూసిన ధరణి (Dharani).. బాల్‌ని సిక్సర్‌గా మలిచి.. బ్యాట్‌ని గాల్లో విసిరేసి.. నడుచుకుంటూరావడం.. గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ గ్లింప్స్‌కు సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan) సమకూర్చిన నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవల్‌‌లో ఉందని చెప్పొచ్చు. ఇంకా నాని బర్త్ డే సందర్భంగా ‘దసరా’కు తెలుగు రాష్ట్రాల్లోని 39 కేంద్రాల్లో కౌంట్‌డౌన్ ఇన్‌స్టాలేషన్‌లు ఏర్పాటు చేశారు. ఇది ఇండియన్ సినిమాల్లోనే మొట్టమొదటి మాసీవ్ ఫీట్. సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమై, విడుదల తేదీ వరకు ప్రతి రోజు థియేటర్లలో కటౌట్‌లను మారుస్తారు. తర్వాత, కౌంట్‌డౌన్ ఇన్‌స్టాలేషన్‌లు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర నగరాల్లో ఏర్పాటు చేస్తారు.

శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో.. మేకర్స్ డబుల్ ఎనర్జీతో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తోన్న ఈ చిత్రంలో నానికి జోడిగా కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తోంది.


ఇవి కూడా చదవండి

*********************************

Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!

Nagineedu: నాకస్సలు భయం లేదు.. నేనే రాజు, నేనే మంత్రి (OHRK Promo)

Meena: ‘శుభలగ్నం’ రీమేక్ చేస్తే చేయాలనుకున్నా.. కానీ?


Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు

Premi Viswanath: అరుదైన వ్యాధి.. ‘కార్తీకదీపం’ వంటలక్క కూడా ఆ బ్యాచ్‌లోకి!

Madhumitha Sivabalaji: ‘ఊ అంటావా మావ.. ఉఊ అంటావా’.. స్టెప్పులతో అరాచకం

Updated Date - 2023-02-24T18:14:19+05:30 IST