Home » Dasara
దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకి. అలాంటి పండగ వేళ.. అమ్మవారిని పూజిస్తే చాలు సకల సంపదలు ఇస్తుంది. అమ్మవారు అష్టలక్ష్ముల రూపంలో దర్శనమిస్తారు. ఈ రూపాల్లో అమ్మవారిని దీపావళి వేళ పూజిస్తే మాత్రం అదృష్టం తలుపుతట్టినట్లేనని శాస్త్ర పండితులు చెబుతున్నారు.
బతుకమ్మ, దసరా పండగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ, సంతోష్ నగర్ నుంచి పలు ప్రాంతాలకు బస్సులను నడిపింది.
పండగ వేళ.. అక్కచెల్లెమ్మలను నిరుత్సాహపరిచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు కింద రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించి.. అవి ఇవ్వకుండా గుండు సున్నా చుట్టాడని విమర్శించారు. కేసీఆర్ కిట్ కంటే మంచి కిట్ ఇస్తామని చెప్పి.. పేద గర్భిణీలను సైతం మోసం చేశాడని చెప్పారు. ముదిరాజ్, గంగాపుత్రులంటే సీఎం రేవంత్ రెడ్డికి చిన్నచూపు అని ఆయన ఆరోపించారు.
మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో విజయదశమి వేడుకలను శని వారం అంగరంగ వైభవంగా వైభవంగా నిర్వహించారు.
దసరా పండగ వేళ తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరుగా జరిగాయి. సీజన్లో 20 నుంచి 25 శాతం ఎక్కువగా లిక్కర్ సేల్స్ జరిగాయి. గత మూడు రోజుల నుంచి మద్యం విక్రయాలు పెరిగాయి.
దేశవ్యాప్తంగా దసరా వేడుకలు ప్రతి ఒక్కరు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. చెడుపై మంచి విజయం సాధించినందుకు ప్రతీకగా ఈ పండగ చేసుకుంటారు. దసరా పండగకు చాలా ప్రత్యేకలున్నాయి. మహిషాసురుడిని శ్రీదుర్గాదేవి సంహరించడం.. తేత్రాయుగంలో రావణుడిపై యుద్ధంలో శ్రీరాముడు గెలవడం.. మహాభారతంలో విరాట పర్వంలో పాండవులు అజ్జాత వాసం ముగియడంతో.. జమ్మి చెట్టుపై ఉన్న ఆయుధాలను ఆర్జునుడు కిందకి దింపడం.. తదితర సంఘటనలన్నీ ఈ దసరా పర్వదినం రోజే చోటు చేసుకున్నాయని పెద్దలు పేర్కొంటారు.
ఏళ్ల తరబడి జవాన్లు ఆయుధపూజ చేయడం సంప్రదాయంగా వస్తోందని, ఈరోజు విజయానికి సంకేతమని, శ్రీరాముడు రావణుని సంహరించిన రోజని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇది కేవల విజయం కాదు, మానవతావాదాన్ని దక్కిన విజయమని అన్నారు.
దసరా శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శనివారం ఉదయం ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా దేవాలయ ప్రాంగణంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు.
హిందువులంతా ఒక తాటిపైకి వచ్చి బలంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. బలహీనంగా ఉండడమనేది నేరమనే విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని ఆయన హిందువులకు సూచించారు. మనం బలహీనంగా ఉంటే మాత్రం దుర్మార్గుల దురాగతాలను ఆహ్వానించడమేనని ఆయన పేర్కొన్నారు.
నవరాత్రులు నేటితో ముగియనున్నాయి. దీంతో జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. దసరా పర్వదినం సందర్భంగా పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల క్యూలతో ఆలయ పరిసర ప్రాంతాలు నిండిపోయాయి.