Nani: ‘దసరా’ పై ఆసక్తికర ట్వీట్.. ఒకటే భాగం రెండు సినిమాల పవర్..

ABN , First Publish Date - 2023-01-27T18:11:36+05:30 IST

సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అనేది లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన నటుడు నాని (Nani). తాజాగా ఆయన నటిస్తోన్న చిత్రం ‘దసరా’ (Dasara). ఈ మూవీ టీజర్ జనవరి 30న విడుదల కానుంది.

Nani: ‘దసరా’ పై ఆసక్తికర ట్వీట్.. ఒకటే భాగం రెండు సినిమాల పవర్..

సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అనేది లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన నటుడు నాని (Nani). తాజాగా ఆయన నటిస్తోన్న చిత్రం ‘దసరా’ (Dasara). ఈ మూవీ టీజర్ జనవరి 30న విడుదల కానుంది. టీజర్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ‘దసరా’ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.

‘‘ఒకటే భాగం. కానీ, రెండు లేదా అంతకంటే ఎక్కువ సినిమాల పవర్ ‘దసరా’ లో ఉంటుంది’’ అని నాని ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్ కింద నెటిజన్స్ ఆసక్తికరంగా స్పందించారు. దసరా చిత్రం అంచనాలను మించి రాణించాలని ఆకాక్షించారు. ఈ మూవీ బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతుంది. పాన్ ఇండియాగా రూపొందుతుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌ పాత్రను పోషిస్తుంది. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. అతడు ఈ మూవీతోనే దర్శకుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ‘దసరా’ ను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు. నాని ఈ చిత్రంలో సిల్క్ స్మిత అభిమానిగా కనిపించనున్నాడు. ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఎడిటర్‌‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌‌గా అవినాష్‌ కొల్లా పని చేస్తున్నారు. ‘దసరా’ ప్రపంచవ్యాప్తంగా 30 మార్చి 2023న విడుదల కానుంది.

Updated Date - 2023-01-27T18:11:37+05:30 IST