NASA Rules: అంతరిక్షంలో ఉండగా ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని ఏం చేస్తారు..? నాసా రూల్స్ ఏంటంటే..!
ABN , First Publish Date - 2023-08-03T16:34:15+05:30 IST
అంతరిక్షంలో ఉండగా ఎవరైనా చనిపోతే ఆ వ్యోమగాముల మృతదేహాలను ఏం చేస్తారు? లక్షల కోట్ల కిలోమీటర్ల ప్రయాణం చేసే క్రమంలో మరణించిన వారికి ఎలాంటి గతి పడుతుంది?
భూమి, సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ చిన్నప్పటి నుండి చదువుకుంటున్నవే. ఎన్నేళ్ళు చదువుకున్నా వీటి గురించి సమాచారానికి ముగింపు అంటూ లేదు. ఇక ఇతర గ్రహాల గురించి, ఆయా గ్రహాల మీద వాతావరణం, అక్కడి జీవులు, మానవ ఆవాసానికి అక్కడి పరిస్థితుల గురించి శాస్ర్తవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. రహాస్యాలకు నెలవైన అంతరిక్షానికి ఎగసి అక్కడి వింతలు, విశేషాలు తెలుసుకోవాలని నిరంతర ప్రయత్నాలలో నిమగ్నమై ఉన్నారు. అయితే అంతరిక్షంలో ఉండగా ఎవరైనా చనిపోతే ఆ వ్యోమగాముల మృతదేహాలను ఏం చేస్తారు? లక్షల కోట్ల కిలోమీటర్ల ప్రయాణం చేసే క్రమంలో మరణించిన వారికి ఎలాంటి గతి పడుతుంది? ఇలాంటి విషయాలలో నాసా ఏర్పాటుచేసిన రూల్స్ ఏంటి? అనే విషయాలు చాలా మందికి తెలియవు.. అంతరిక్షంలో ఉండగా ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాన్ని ఏం చేస్తారో తెలుసుకుంటే..
అంతరిక్షంలో(Space) రహస్యాలను చేధించేందుకు గానూ భారతదేశంతో సహా ప్రపంచంలోని ఎన్నో దేశాలు అంతరిక్ష ప్రయాణాలు(space journey) చేయడం సాధారణమైపోయింది. ఒకప్పుడు అంతరిక్ష ప్రయాణాలు చాలా అరుదుగా ఉండేవి. రానురాను ఈ అంతరిక్ష ప్రయాణాల పరంపర పెరుగుతోంది. 60ఏళ్ళ క్రితం అంతరిక్ష పరిశోధనలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే 60ఏళ్ళ కాలంలో అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా 20మంది మరణించారు. 1967లో అపోలో 1లాంచ్ ప్యాడ్ అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యోమగాములు, 1971లో సోయుజ్ 11మిషన్ సమయంలో ముగ్గురు వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు. ఇక 1986-2003 సంవత్సరాల మధ్య కాలం లో 14 మంది వ్యోమగాములు నాసా స్పేస్ షటిల్(NASA space shuttle) ప్రమాదాలలో మరణించారు. నిజానికి అంతరిక్ష యానానికి ఆరోగ్యపరంగా ఎంతో దృఢంగా ఉండే వ్యోమగాములను(Astronauts) ఎంపిక చేస్తారు.
Tigers Video: బస్సును చుట్టుముట్టిన పులులు.. గజగజ వణికిపోయిన ప్రయాణీకులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!
అంతరిక్షకేంద్రం నుండి అంతరిక్ష నౌక నింగికి ఎగిసిన తరువాత తక్కువ దూరంలో ఉండగా ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాన్నికొన్ని గంటల్లోనే భూమికి తిరిగి తీసుకువస్తారు. అదే చంద్రుడి మీద మరణం సంభవిస్తే మృతదేహాన్ని భూమికి తిరిగి తీసుకురావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఇక అంగారక గ్రహానికి 300మిలియన్ మైళ్ల ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణంలో వ్యోమగామి చనిపోతే ఆ వ్యోమగామి మృతదేహాన్ని వెంటనే తిరిగి తీసుకురావడం కుదరదు. ఈ ప్రయాణం ముగిసేవరకు మృతదేహాన్ని వ్యోమనౌక లోనే ప్రత్యేక ఛాంబర్ లేదా బాడీ బ్యాగ్ లో భద్రపరుస్తారు(dead body store in body bag). అంతరిక్షంలోనో, ఇతర గ్రహాల మీద ఉన్నప్పుడో మృతదేహాలను పూడ్చిపెట్టడం, దహనం చేయడం వంటి పనులు అస్సలు చేయరు. ఇతర వ్యోమగాములు తమ పనులను నిర్థేశించుకున్న సమయంలో పూర్తిచేయడం కూడా అవసరం అవుతుంది. ఒకరి మృతితో ఈ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అందుకే నాసా అంతరిక్షంలో ఉండగా మరణించేవారికోసం ఈ రూల్స్ ఏర్పాటుచేసింది.