Home » NASA
చందమామపై మానవ శాశ్వత ఆవాసాలే లక్ష్యంగా ‘ఆర్టెమిస్’ ప్రాజెక్టును చేపట్టిన అమెరికా అంతరిక్ష పరిశోధనల సంస్థ నాసా.. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఓ భారీ ఆక్సిజన్ పైప్‌లైన్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది!
ఢిల్లీ ఎన్సీఆర్లో వాయుకాలుష్యానికి పంజాబ్, హర్యానాలలో పొట్టు దగ్ధం వంటి ఘటనలు ఓ కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు వీటిని అరికట్టాలని చెప్పినప్పటికీ అనేక మంది రైతులు పాటించడం లేదని సూచిస్తున్నారు. అందుకు సంబంధించిన చిత్రాలను ఇటివల నాసా విడుదల చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నుంచే తాను ఓటు హక్కు వినియోగించుకోనున్నట్టు అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ తాజాగా పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటు వేయడం పౌరుల ప్రాథమిక బాధ్యత అని గుర్తు చేశారు.
భూగ్రహాన్ని మరో అస్టెరాయిడ్ భయపెడుతోంది. భయోత్పాతాలు సృష్టిస్తాడని ఈజిప్ట్ ప్రజలు భావించే ‘అపోఫిస్’ అనే దేవుడు పేరును ఈ ఆస్టెరాయిడ్‌కుపెట్టారు. ఈ గ్రహశకలం ఏప్రిల్ 13, 2029న భూమికి అత్యంత సమీపం నుంచి ప్రయాణించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాగా ఈ అస్టెరాయిడ్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత నిశితంగా పరిశీలిస్తోంది.
కేవలం ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి.. 80 రోజులుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) చిక్కుకుపోయిన అమెరికా వ్యోమగాములు సునీత విలియమ్స్, బ్యారీ విల్ మోర్ భూమికి ఎప్పుడు తిరిగొస్తారనే ఉత్కంఠ కొనసాగుతున్న వేళ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) కీలక ప్రకట చేసింది.
చంద్రయాన్-3 ఘన విజయం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన తదుపరి మూన్ మిషన్లు చంద్రయాన్-4, 5పై దృష్టిపెట్టింది.
ఎస్ఎస్ఎల్వీ -డీ3 ప్రయోగం విజయవంతమైంది. దీంతో ఇస్రో మరో చారిత్రాత్మక మైలురాయికి చేరింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం ఉదయం 9.17 గంటలకు ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ3 రాకెట్ ప్రయోగం చేపట్టారు.
భారత గగన్‌యాన్ మిషన్‌లో(Gaganyaan Astronaut) శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల్లో ఒకరు నాసాతో కలిసి పనిచేసేందుకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభకు తెలిపారు.
రామసేతుకు(Ram Setu) సంబంధించిన రహస్యాలను ఛేదించడంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) మరో మైలురాయి చేరుకుంది. NASA ఉపగ్రహం సహాయంతో మొదటిసారిగా ఆడమ్ బ్రిడ్జ్ అని పిలిచే రామసేతు మ్యాప్‌ను ఆదివారం విడుదల చేసింది.
నాలుగు విఫలయత్నాల అనంతరం ఎట్టకేలకు అగ్నికుల్ కాస్మో్‌సకు చెందిన ప్రైవేటు రాకెట్ ‘అగ్నిబాణ్’ నింగిలోకి ఎగిరింది. చెన్నైకి చెందిన స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ సంస్థ అగ్నిబాణ్ పేరిట తొలిసారిగా రూపొందించిన రాకెట్ ప్రయోగాన్ని గురువారం విజయవంతంగా నిర్వహించింది.