National Beer Day 2023: బాగా ఇష్టంగా తాగే బీర్‌కీ ఓ రోజుంది.. అంతేకాదు వీటి బ్రాండ్స్ గురించి తెలిస్తే..
ABN , First Publish Date - 2023-04-07T14:14:14+05:30 IST
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన బీర్ బ్రాండ్, ఇది బీర్ వారసత్వాన్ని గరిష్ట స్థాయికి తీసుకువెళ్ళింది.
ఈరోజు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన వచ్చే జాతీయ బీర్ దినోత్సవమట, అయితే మధువును ఇష్టపడే అందరూ ఈరోజును చాలా ఇష్టంగా జరుపుకుంటారు. ముఖ్యంగా బీర్ ప్రియులు. అయితే అందరూ ఇష్టపడే బీర్‌ను తయారుచేసే పద్దతి ఉందే అదే కాస్త కష్టంతో కూడుకున్నదని ఇప్పటి వారికి తెలియకపోవచ్చు. అయితే ఈ బీర్స్ లో ముఖ్యంగా పాతకాలం నాటి ఒకప్పటి బ్రాండ్స్ మాత్రమే ఇప్పటికీ ఇష్టంగా తాగుతున్నారు. దీనికి కారణం వీటి రుచి, తయారీలో ఉన్న స్మూత్ నెస్‌ని ఎక్కువగా ఇష్టపడేవారున్నారు. అయితే ఈ బ్రాండ్స్ ప్రస్తుతం ఆదరణలో ఉన్నవాటి గురించి మాట్లాడుకుంటే...
స్మూత్, రిఫ్రెష్‌ని ఇస్తుంది..
గాడ్‌ఫాదర్ మూడు దశాబ్దాల క్రితం దేవన్స్ మోడరన్ బ్రూవరీస్ లిమిటెడ్ (DEVANS MODERN BREWERIES LIMITED) ప్రవేశపెట్టిన హోమ్ గ్రోన్ స్ట్రాంగ్ (Home Grown Strong) బీర్‌లలో ఒకటి. ఇది నేటికీ మంచి జనాదరణ పొందుతూనే ఉంది.. దీని తాజా వేరియంట్ గాడ్ ఫాదర్ సూపర్ (Variant Godfather Super 8) ప్రస్తుతం భారతదేశంలో 8% అమ్ముడుపోతున్న బీర్. దీనిని తీసుకుంటే ఎక్కడలేని రిఫ్రెష్ మూడ్ లోకి వెళతామని బీర్ ఇష్టపడేవారు నమ్ముతారు. అంతేకాదు రుచిలోనూ స్మూత్‌గా ఉంటుందట.
ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్
ఐరన్‌హిల్ ఇండియా అద్భుతమైన క్రాఫ్ట్ బీర్లు అంతర్జాతీయంగా లభించే నాణ్యత పదార్థాల నుంచి తయారవుతుంది. దీని రుచి కూడా ప్రత్యేకంగా ఉంటుంది.
సుప్రీమ్ టేస్ట్
బడ్‌వైజర్ మాగ్నమ్‌లో ఆల్కహాల్ కంటెంట్ 6.5% అయినప్పటికీ, అమెరికన్ స్ట్రాంగ్ బీర్లు భారతదేశంలో లభించే అత్యంత డిమాండ్ ఉన్నబ్రాండ్స్. బడ్‌వైజర్‌ను తయారు చేయడానికి కనీసం 21 రోజులు పడుతుంది. బడ్‌వైజర్ మాగ్నమ్ నలుపు, బంగారు ప్యాకేజింగ్‌లో లభ్యమవుతుంది, రుచిలో కూడా స్మూత్‌గా ఉంటుంది.
రిచ్ మాల్టీ క్యారెక్టర్
అదనపు స్ట్రాంగ్ బీర్ 7% abvతో వస్తుంది. మాల్ట్‌తో పాటు, బీర్‌లో పంచదార పాకం, పొడి చేదు ఉంటుంది. ప్రపంచంలోని పురాతన బీర్ తయారీదారులలో కార్ల్స్‌బర్గ్ ఎలిఫెంట్ ఒకటి. దీని అదనపు స్ట్రాంగ్ సరదాగా, ఉల్లాసంగా ఉండే పండుగ సాయంత్రం కిక్‌ను అందిస్తుంది.
ఇది కూడా చదవండి:
గుండె జబ్బులకు దూరంగా ఉండాలనుకునేవాళ్లు వారంలో రెండు రోజులు ఇలా చేయండి చాలు..
పర్ఫెక్ట్ రుచి
కింగ్‌ఫిషర్ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన బీర్ బ్రాండ్, ఇది బీర్ వారసత్వాన్ని గరిష్ట స్థాయికి తీసుకువెళ్ళింది. ఈ రిఫ్రెష్ బీర్ అత్యుత్తమమైన పిల్సెన్ నుండి తయారు చేస్తారు. ఖచ్చితమైన రుచిని కోసం రోజుల తరబడి తయారు చేయారవుతుంది. నలుపు, బంగారు రంగులలో సొగసైన డిజైన్ చేసిన సీసాలో ప్యాక్ చేయబడి, ఆస్వాదిస్తుంది. ఇందులోని abv 5% , 8% మధ్య ఉంటుంది.
క్రిస్ప్, బ్యాలెన్స్డ్
సింబా స్ట్రాంగ్ రుచి, వాసనతో మనసుకు ఇంపుగా ఉంటుంది. మాల్ట్, రొట్టె, సిట్రస్‌తో, ఈ బీర్ చేదు తగిలీ తగలకుండా ఆస్వాదించవచ్చు. ఇది ముదురు కాషాయం రంగులో ఉంటుంది.