Naveen Murder Case : పోలీసు విచారణలో పచ్చి నిజం చెప్పిన హరిహరకృష్ణ.. ఆ ఒక్క మాటతో కంగుతిన్న పోలీసులు..!
ABN , First Publish Date - 2023-03-06T22:34:23+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తోంది. ఈ హత్య కేసులో (Naveen Murder case) సోమవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది...
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తోంది. ఈ హత్య కేసులో (Naveen Murder case) సోమవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. హంతకుడు హరిహరకృష్ణ (HariHara Krishna) ప్రియురాలు నిహారిక రెడ్డితోపాటు (Niharika Reddy) స్నేహితుడు హాసన్ (Hasan) పేర్లను పోలీసులు ఈ కేసులో చేర్చారు. హాసన్‌ను ఏ2గా, నిహారికను ఏ3గా పోలీసులు తేల్చారు. వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ కేసులో హరిహరకృష్ణ ఏ1 గా ఉన్న విషయం తెలిసిందే. ఇవన్నీ ఒక ఎత్తయితే.. పోలీసు విచారణలో చిత్రవిచిత్రంగా ప్రవర్తించిన హరిహరకృష్ణ.. ఒక విషయాన్ని మాత్రం పదే పదే చెప్పాడట. ఇది ఆలస్యంగా వెలుగుచూసింది.
పదే పదే ఈ విషయమే..!
‘నా లవర్ నిహారిక రెడ్డి కళ్లలో ఆనందం చూడటానికే నవీన్‌ను హత్య చేశాను’ అని విచారణలో నిందితుడు హరిహరకృష్ణ గంటకోసారి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే మాట ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. పదే పదే ఇలా అనడంతో పోలీసులు సైతం నివ్వెరపోయారట. ఇదొక్కటే కాదు.. హత్యచేసిన తర్వాత నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోవడం, చట్టం గురించి పోలీసులకే ఎదురుచెప్పడం వీటన్నింటితో ఇలా ఉన్నాడేంట్రా బాబూ.. పోలీసులు ఆశ్చర్యపోయారట. ఆ తర్వాత మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు.. ఈ కేసులో సూత్రధారులెవరు..? పాత్రదారులెవరు..? అనే విషయాన్ని తేల్చి.. కేసులో హాసన్, నిహారికరెడ్డి పేర్లు చేర్చినట్లుగా సమాచారం.
అసలేం జరిగిందో.. పిన్ టూ పిన్..!
ఇదిలా ఉంటే.. పక్కా పథకం ప్రకారమే నవీన్‌ను హరిహరకృష్ణ హత్య చేశాడని పోలీసులు విచారణలో నిగ్గు తేల్చారు. ‘ముందుగానే సర్జరీ చేసే బ్లేడ్లు, గ్లౌజ్‌లను తన వెంట తీసుకువెళ్లాడు. మద్యం మత్తులోనే హరిహరకృష్ణ.. నవీన్‌ను బండిపై నుంచి తోసివేసి గొంతు నులిమి చంపేసి ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న కత్తితో శరీర భాగాలను తీసి హత్య చేశాడు. ఆ తర్వాత బాడీ పార్ట్స్‌ను వాట్సాప్ ద్వారా నిహారికకు పంపాడు హరిహర. ఆ అవయవాలను ఓ సంచిలో వేసుకొని బ్రాహ్మణపల్లిలో ఓ చెట్ల పొదలో తగలబెట్టాడు. ఫొటోలు చూశాక ‘Very Good Boy’ అని హరిహరకు నిహారిక రిప్లయ్ ఇచ్చింది. హత్య తర్వాత హసన్ ఇంటికి వెళ్లి రక్తం మరకలు ఉన్న షర్ట్‌తో వెళ్లాడు. అక్కడ స్నానం చేసి ఫ్రెండ్ బట్టలు వేసుకుని నిహారికను కలవడానికి వెళ్లాడు. లవర్‌ను కలిశాక అక్కడ నుంచి వరంగల్ మీదుగా హరిహర వైజాగ్ వెళ్లాడు. డబ్బులు అయిపోవడంతో మళ్లీ నిహారిక వద్దకు రిటర్న్ వచ్చాడు. ఆ తర్వాత.. నిహారికను వెంట పెట్టుకొని నవీన్‌ను హత్య చేసిన ప్రాంతానికి వెళ్లి.. దూరం నుంచే నవీన్ మృతదేహాన్ని చూపించాడు’ అని పోలీసులు ఈ విషయాలన్నీ మీడియాకు వెల్లడించారు.
హరిహరకు దూరంగా పేరెంట్స్!
అయితే.. ఇంత చేసినా ఎక్కడ కూడా హరిహరలో ఎలాంటి పశ్చాత్తాపం లేకపోవడం గమనార్హం. ‘హత్య ఎలా చేయాలి..? చేసిన తర్వాత ఏం చేయాలని ముందుగానే గూగుల్, కొన్ని హర్రర్ సినిమాలను చూసి స్కెచ్ రెడీ చేసుకున్నాడు. ఎవరికీ దొరక్కుండా హరిహర అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఏడు రోజుల కస్టడీకి కోర్టు ఓకే చెప్పింది. అయితే.. నిందితుడ్ని ఎస్ఓటి ఆఫీస్‌కు తరలించిన నేపథ్యంలో గత నాలుగైదు రోజులుగా హరిహరను చూడటానికి తల్లిదండ్రులు రావట్లేదు. తనకు ఇష్టమైన ఆహారమే కావాలని మాకే ఎదురుచెప్పాడు’ అని పోలీసులు చెబుతున్నారు. కస్టడీకి ఏ మాత్రం సహకరించకుండా.. పోలీసులనే ముప్పుతిప్పులు పెడుతున్నాడట. మరోవైపు.. ఈ హత్య కేసులో నిందితులు A2 హాసన్, A3 నిహారికను వైద్యం కోసం వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యం అనంతరం హయత్ నగర్ మెజిస్ట్రేట్ ముందు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు హాజరుపరచనున్నారు.