``మీ నాన్న నా అప్పు తీర్చనవసరం లేదు.. నేను చెప్పినట్టు చెయ్యి``.. ఒంటరిగా ఉన్న బాలిక దగ్గరకు వచ్చి ఆ వ్యక్తి చేసిన పనికి..
ABN , First Publish Date - 2023-03-12T16:22:47+05:30 IST
18 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉంది.. కుటుంబ సభ్యులందరూ బంధువుల ఇంటికి వెళ్లడంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండి చదువుకుంటోంది.. ఆ బాలిక ఒంటరిగా ఉన్నట్టు ఎదురింటి వ్యక్తి గమనించాడు..
18 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉంది.. కుటుంబ సభ్యులందరూ బంధువుల ఇంటికి వెళ్లడంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండి చదువుకుంటోంది.. ఆ బాలిక ఒంటరిగా ఉన్నట్టు ఎదురింటి వ్యక్తి గమనించాడు.. ఆ యువతి తండ్రికి అతడు గతంలో రూ.10 వేలు అప్పు ఇచ్చాడు.. అప్పు అడిగే నెపంతో ఆ యువతి ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లాడు.. ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు.. తను చెప్పిన్టటు వింటే మీ నాన్నకు ఇచ్చిన డబ్బులు తీసుకోనని ఆశ పెట్టాడు (Sexual Harassment).
రాజస్థాన్లోని (Rajasthan News) జైపూర్లో ఓ కాలనీలో 18 ఏళ్ల యువతి తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఎదురింట్లో నివసించే 35 ఏళ్ల వ్యక్తి యువతి తండ్రికి రూ.10వేలు అప్పుగా ఇచ్చాడు. యువతిపై కన్నేసిన నిందితుడు ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. యువతికి విషయం అర్థమై అతడిని వారించడానికి ప్రయత్నించింది. దాంతో నిందితుడు డబ్బు ప్రస్తావన తెచ్చాడు. తనకు సహకరిస్తే గతంలో అప్పుగా ఇచ్చిన రూ.10 వేలు అడగనని హామీ ఇచ్చాడు. అయినా యువతి అంగీకరించలేదు.
Viral Video: ఏం ఎండలు రా బాబూ.. వేడి తట్టుకోలేక ఆ ఏనుగు ఎలా స్నానం చేస్తోందో చూడండి..
ఒంటరిగా ఉన్న యువతి కేకలు వేయడంతో నిందితుడి ఇంటికి వెళ్లిపోయాడు. తన కుటుంబ సభ్యులు తిరిగి వచ్చిన తర్వాత జరిగిన మొత్తం విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు (Crime News).