Viral News: ఎఫ్‌బీలో పరిచయమైన యువకుడి కోసం.. భర్తను వదిలేసి బిహార్ చేరిన నేపాల్ మహిళ.. అదేంటని అడిగితే షాకింగ్ సమాధానం..!

ABN , First Publish Date - 2023-02-04T11:48:41+05:30 IST

ఫేస్‌బుక్‌లో (Facebook) పరిచయమైన యువకుడి కోసం నేపాలీ మహిళ (Nepal Woman) దేశం దాటొచ్చింది.

Viral News: ఎఫ్‌బీలో పరిచయమైన యువకుడి కోసం.. భర్తను వదిలేసి బిహార్ చేరిన నేపాల్ మహిళ.. అదేంటని అడిగితే షాకింగ్ సమాధానం..!

ఇంటర్నెట్ డెస్క్: ఫేస్‌బుక్‌లో (Facebook) పరిచయమైన యువకుడి కోసం నేపాలీ మహిళ (Nepal Woman) దేశం దాటొచ్చింది. ఇండియాకు (India) వచ్చి తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి (Marriage) చేసుకుంది. అదేంటని అడిగితే.. ఆమె చెప్పిన సమాధానం అక్కడి వారిని షాక్‌కు గురి చేసింది. ఈ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నేపాల్‌కు చెందిన ఓ వివాహిత (Married Woman) తాను ప్రేమించిన యువకుడి కోసం కట్టుకున్న భర్తను, పిల్లలను, తన పేరెంట్స్‌ను కూడా వదిలేసి బిహార్‌కు (Bihar) వచ్చింది. ఆమె పేరు పార్వతి. బిహార్ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లాకు చెందిన వికాస్ (24)కు ఫేస్‌బుక్‌ ద్వారా ఏడాది క్రితం పార్వతి (26) పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా (Love) మారింది. దాంతో ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకోవడం, వీడియో కాల్స్, చాట్ చేయడం చేశారు.

ఇది కూడా చదవండి: పెళ్లయిన తొమ్మిదో రోజే కొత్త కోడలు చేసిన పనికి మామయ్యకు హార్ట్ అటాక్.. అత్తారింట్లో అంతా ఆగమాగం..!

ఆ తర్వాత కొంతకాలానికి వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దాంతో పార్వతి కీలక నిర్ణయం తీసుకుంది. భర్త, పిల్లలను వదిలేసి బిహార్‌లోని జాఖర్ బిషన్‌పూర్‌లో (Jakhar Bishanpur) ఉండే వికాస్ ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత ఇద్దరూ స్థానికంగా ఉండే ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం కాస్త బయటకు రావడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ జంట మీడియాతో మాట్లాడింది. 'వికాస్‌తో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నానని, ఎట్టిపరిస్థితుల్లో స్వదేశానికి తిరిగి వెళ్లేది లేదని' పార్వతి తెలిపింది. అలాగే వికాస్ కూడా తాను పార్వతిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. అటు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అయితే, పార్వతి మాత్రం తన మొదటి మ్యారేజ్ లైఫ్‌తో హ్యాపీగా లేనని, తాను ఇష్టపూర్వకంగానే భర్తను వదిలేసి వచ్చానని చెబుతోంది.

ఇది కూడా చదవండి: ప్రవాసుడికి కలలో కూడా ఊహించనంత డబ్బు.. భారతీయులకు భారీ క్యాష్, కాస్ట్లీ గిఫ్ట్!

Updated Date - 2023-02-04T11:53:21+05:30 IST