Abortion: అబార్షన్ చేయించుకునేందుకు ఆస్పత్రికి వచ్చిన మహిళ.. మెల్లిగా మాటల్లోకి దింపి నర్సులు చెప్పిన ఆఫర్ విని ఆమెకు షాక్.. సరేనని చెప్పి..

ABN , First Publish Date - 2023-03-31T19:42:58+05:30 IST

అబార్షన్ చేయించుకునేందుకు ఆసుపత్రికి వెళ్లిన మహిళను ఊహించని ఆఫర్..

Abortion: అబార్షన్ చేయించుకునేందుకు ఆస్పత్రికి వచ్చిన మహిళ.. మెల్లిగా మాటల్లోకి దింపి నర్సులు చెప్పిన ఆఫర్ విని ఆమెకు షాక్.. సరేనని చెప్పి..

ఇంటర్నెట్ డెస్క్: అబార్షన్(Abortion) చేయించుకునేందుకు ఆసుపత్రికి వెళ్లిందా మహిళ. ఇక కడుపులోని బిడ్డ తొలగించుకోవడమే తరువాయి అని అనుకుంటుండగా ఆసుపత్రి సిబ్బంది నుంచి ఆ మహిళకు ఊహించని ఆఫర్ వచ్చింది. వారు చెప్పినట్టు చేస్తే భారీ మొత్తం కళ్లచూడచ్చని ఆమె కూడా ఆశపడింది. చివరకు బిడ్డను కనేందుకే నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆమెకు రూ. లక్ష దక్కాయి. అంతాఅనుకున్నట్టు జరిగిపోయిందని మహిళతో పాటూ ఆసుపత్రి సిబ్బంది కూడా అనుకుంటున్న తరుణంలో కథ మరో మలుపు తిరిగింది. వారి కుట్ర గురించి బయటపడటంతో నిందితులందరూ కటకటాల పాలయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళితే..ఝార్ఖండ్‌లోని(Jharkhand) ఛత్రా సరద్ ఆసుపత్రికి ఓ గర్భవతి అబార్షన్ కోసం వెళ్లింది. కానీ.. అక్కడే ఉన్న సిబ్బంది మాత్రం ఆమె ముందు ఓ ఊహించని ఆఫర్ పెట్టారు. ఆమె కడుపులో ఉన్న ఆడబిడ్డను కొనుక్కునేందుకు పిల్లలు లేని ఓ జంట సిద్ధంగా ఉందని, బిడ్డను కనిస్తే లక్ష రూపాయలు ముట్టచెబుతామని ఆశచూపారు. దీంతో.. ఆమె అంగీకరించింది. ఇటీవలే ఆమె బిడ్డను ప్రసవించగా.. గంటల వ్యవధిలో ఆసుపత్రి సిబ్బంది, దళారులు ఆ బిడ్డను విక్రయించేశారు. బిడ్డను కొనుక్కున్న జంట నుంచి ఏకంగా రూ.4.5 లక్షలు వసూలు చేశారు. బిడ్డను కనిచ్చిన మహిళకు లక్ష చేతిలోపెట్టారు.

అయితే.. నవజాత శిశువు(Kid sold) ఇలా చేతులు మారిన విషయం ఆసుపత్రి ఉన్నతాధికారులకు తెలిసింది. దీంతో..వారు వెంటనే ఎస్పీకి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన పోలీసులు ఈ కేసులో నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.64 లక్షల నగదు, కొన్ని సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నవజాత శిశువును కూడా రక్షించి బాలల సంక్షణాలయానికి తరలించారు. నిందితులు చిన్నారుల అక్రమరవాణాలో ఆరితేరిపోయారని చెప్పారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది.

Updated Date - 2023-03-31T19:42:58+05:30 IST