No Challan for Traffic Violations: రూల్స్‌ను బ్రేక్ చేసినా చలానా విధించమంటూ ట్రాఫిక్ పోలీసుల ప్రకటన.. కానీ ఒకే ఒక్క కండీషన్ ఏంటంటే..!
ABN , First Publish Date - 2023-03-11T15:51:06+05:30 IST
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినా, సరైన పత్రాలు లేకపోయినా ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు భారీగా జరిమానాలు వేస్తారనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఛండీగఢ్ పోలీసులు ఓ కొత్త స్కీమ్ పెట్టారు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినా, సరైన పత్రాలు లేకపోయినా ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు భారీగా జరిమానాలు వేస్తారనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఛండీగఢ్ (Chandigarh) పోలీసులు ఓ కొత్త ప్రకటన జారీ చేశారు. అత్యవసర వాహనాలకు దారి ఇచ్చే క్రమంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినా పట్టించుకోబోమని స్పష్టం చేశారు. ఒకవేళ ఆ సమయంలో ఏ కానిస్టేబుల్ అయినా జరిమానా విధించినా దానిని రద్దు చేస్తామని పేర్కొన్నారు (No Challan for Traffic Violations).
దేశవ్యాప్తంగా ట్రాఫిక్ జామ్‌ల మధ్య చిక్కుకుని సకాలంలో వైద్యం అందక అంబులెన్స్‌లలో ఉన్న రోగులు ప్రాణాలు కోల్పోతునట్టు నివేదికలు పేర్కొంటున్నాయి. ట్రాఫిక్ చలాన్ భయంతోనే చాలా మంది అంబులెన్స్‌లకు దారి ఇవ్వడం లేదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అత్యవసర వాహనాలకు (అంబులెన్స్, ఫైర్ బ్రిగేడ్) దారి ఇచ్చే సమయంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే తమ వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధిస్తారని సామాన్యులు భయపడుతున్నట్లు చంఢీగడ్ ట్రాఫిక్ పోలీసుల (Chandigarh police) దృష్టికి వచ్చింది.
Radhe Shyam Train Scene: రాధేశ్యామ్ సినిమా చూశారేమో.. ట్రైన్ సీన్‌ను రిపీట్ చేయాలనుకున్న ప్రేమజంట.. అంతా ఓకే కానీ..!
చలాన్‌లు జారీ చేసే ముందు పోలీసులు వీడియో ఫుటేజీను పరిశీలించి ఉల్లంఘనలను చూస్తారని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు (Traffic Violations). ఒక వ్యక్తి అత్యవసర వాహనానికి దారి ఇచ్చే సమయంలో ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలితే, ఆ వాహనంపై చలాన్ విధించరని పోలీసులు పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా అలాంటి సమయంలో కూడా జరిమానాకు గురైతే వెంటనే police-command@chd.gov.in కు తెలియజేయవచ్చని తెలిపారు.