Miracle: అద్భుతం అంటే ఇదేనేమో.. పెళ్లయి నాలుగేళ్లయినా అస్సలు పిల్లలే పుట్టలేదు.. ఇప్పుడు ఒకే కాన్పులో ఏకంగా..!
ABN , First Publish Date - 2023-08-28T15:27:32+05:30 IST
మనం ఎప్పుడైతే జీవితం మీద ఆశలు కోల్పోతామో, ఎప్పుడు నిరాశకు లోనవుతామో అప్పుడు ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. మనం ఊహించని విధంగా జీవితం టర్న్ అవుతుంది. అప్పుడు మళ్లీ జీవితంపై ఆశలు మొలకెత్తుతాయి. అప్పుడు భగవంతునిపై మన విశ్వాసం పెరుగుతుంది.
మనం ఎప్పుడైతే జీవితం మీద ఆశలు కోల్పోతామో, ఎప్పుడు నిరాశకు లోనవుతామో అప్పుడు ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. మనం ఊహించని విధంగా జీవితం టర్న్ అవుతుంది. అప్పుడు మళ్లీ జీవితంపై ఆశలు మొలకెత్తుతాయి. అప్పుడు భగవంతునిపై మన విశ్వాసం పెరుగుతుంది. తాజాగా ఓ జంటకు అలాంటి అనుభవమే ఎదురైంది. రాజస్థాన్ (Rajasthan)లోని టోంక్‌లోని వజీరాపురకు చెందిన మహిళకు కిరణ్ కన్వర్ అనే మహిళకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది (Viral News).
పెళ్లై నాలుగేళ్లైనా ఆమెకు పిల్లలు పుట్టలేదు. పిల్లల కోసం కిరణ్, ఆమె భర్త ఎన్నో ప్రయత్నాలు చేశారు. వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గుళ్లూ, గోపురాల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆ కుటుంబం నిరాశలో కూరుకుపోయింది. ఆ దశలో ఆమె గర్భం దాల్చింది. తాజాగా ఆమెకు డెలివరీ జరిగింది. ఒకే కాన్పులో ఏకంగా ఆమె నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఆమెకు ఒకేసారి ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు జన్మించారు. దీంతో కిరణ్ కుటుంబంలో సంతోషం నెలకొంది (woman gave birth to 4 children).
Love Proposal: షాపింగ్ మాల్లో షాకింగ్ ట్విస్ట్.. ఫ్రెండ్స్‌తో యువతి ముందు మోకాలిపై కూర్చుని లవ్ ప్రపోజల్.. తర్వాత..
ఇది చాలా అరుదైన కేసుగా డాక్టర్లు అభివర్ణిస్తున్నారు. ఒకే కాన్పులో నలుగురు జన్మించడం, తల్లితో పాటు నలుగురూ క్షేమంగా ఉండడం చాలా అరుదని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం నలుగురిలో ముగ్గురు కాస్త బలహీనంగా ఉండడంతో వారిని ఐసీయూలో ఉంచారు. కాగా, ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించడంతో కిరణ్ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది.