Popcorn Bill: ఇలా అయితే సినిమా థియేటర్లకు ఎలా వెళ్తాం? వైరల్ అవుతున్న పాప్‌కార్న్ బిల్.. నెటిజన్ల సెటైర్లు!

ABN , First Publish Date - 2023-07-03T20:22:55+05:30 IST

సినిమాలను థియేటర్లలో చూస్తే ఆ మజానే వేరుగా ఉంటుంది. స్నేహితులు, కుటుంబ‌ స‌భ్యుల‌తో క‌లిసి థియేట‌ర్‌కు వెళ్లి సినిమా చూడడం ఓ మంచి అనుభవం. అయితే ప్రస్తుతం కుటుంబ స‌భ్యుల‌తో థియేట‌ర్‌కు వెళ్లి సినిమా చూడ‌టం ఖ‌రీదైన వ్య‌వ‌హారంగా మారిపోయింది.

Popcorn Bill: ఇలా అయితే సినిమా థియేటర్లకు ఎలా వెళ్తాం? వైరల్ అవుతున్న పాప్‌కార్న్ బిల్.. నెటిజన్ల సెటైర్లు!

సినిమాలను థియేటర్ల (Movie Theatre)లో చూస్తే ఆ మజానే వేరుగా ఉంటుంది. స్నేహితులు, కుటుంబ‌ స‌భ్యుల‌తో క‌లిసి థియేట‌ర్‌కు వెళ్లి సినిమా చూడడం ఓ మంచి అనుభవం. అయితే కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఓటీటీ (OTT)లు అందుబాటులోకి రావడంతో చాలా మంది మొబైల్ ఫోన్లలోనే సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. మరోవైపు సినిమా థియేటర్ల వద్ద దోపిడీ కూడా బాగా పెరిగిపోయింది. కుటుంబ స‌భ్యుల‌తో థియేట‌ర్‌కు వెళ్లి సినిమా చూడ‌టం ఖ‌రీదైన వ్య‌వ‌హారంగా మారిపోయింది.

సినిమా టిక్కెట్ రేట్లతో పాటు స్నాక్స్, కూల్‌డ్రింక్స్ ధరలు కూడా కొండెక్కడం సామాన్యులను థియేటర్లకు దూరం చేస్తోంది. తాజాగా ఓ వ్యక్తి నోయిడాలోని పీవీఆర్ మల్టీప్లెక్స్‌ (Noida PVR Cinemas)లో సినిమా చూసేందుకు వెళ్లాడు ఇంటర్వెల్ సమయంలో కేవలం ఓ పాప్‌కార్న్, కూల్‌డ్రింక్ తీసుకున్నాడు. కేవలం ఆ రెండింటికే అయిన బిల్ ఏకంగా రూ.820. షాకైన ప్రేక్షకుడు సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని తెలియజేశాడు. త్రిదిప్ కే మండ‌ల్ అనే ట్విటర్ యూజ‌ర్ షేర్ చేసిన ఈ పోస్ట్‌ను ఏకంగా 12 ల‌క్ష‌ల మందికి పైగా వీక్షించారు (Popcorn Bill).

Viral: చనిపోయిందని చెప్పాం కదా.. మళ్లీ తీసుకొచ్చారేంటన్న డాక్టర్లు.. జరిగింది చెప్తే అవాక్కై.. మళ్లీ టెస్టులు చేస్తే..!

పీవీఆర్ మల్టీప్లెక్స్‌లో ఓ చీజ్ పాప్‌కార్న్‌, పెప్సీల‌కు ఏకంగా రూ.820 బిల్లు వేసినట్టు ఆయన ట్వీట్ చేశారు. థియేటర్‌కు వెళ్లినందుకు తానొక్కడే వెళ్లినందుకు అయిన ఖర్చుతో అమేజాన్ ప్రైమ్ వీడియో వార్షిక స‌బ్‌స్క్రిప్ష‌న్‌ తీసుకోవచ్చిన ఆయన పేర్కొన్నారు. కుటుంబం అంతా కలిసి సినిమా చూడడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని కామెంట్ చేశారు. ఆ ట్వీట్‌పై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు.

Updated Date - 2023-07-03T20:22:55+05:30 IST