Share News

Viral Story: 49 ఏళ్ల క్రితం వోల్వో కార్ల కోసం అప్పు.. ఇప్పుడు స్వీడన్‌కు ఉత్తరకొరియా చెల్లించాల్సింది ఎంతంటే..

ABN , First Publish Date - 2023-11-10T21:29:20+05:30 IST

ప్రపంచంలోని చాలా దేశాలతో విభేదాలు పెట్టుకుని తరచుగా వివాదాస్పదంగా ప్రవర్తించే దేశం ఉత్తరకొరియా. ఆ దేశ వ్యవహారాలు ఏవీ సవ్యంగా, స్పష్టంగా బయటకు రావు. ఇతర దేశాల గురించిన సమాచారం కూడా ఆ దేశ ప్రజలకు సక్రమంగా అందదు. కేవలం చైనా, రష్యాతో మాత్రమే ఉత్తరకొరియా కాస్త సఖ్యతగా ఉంటుంది.

Viral Story: 49 ఏళ్ల క్రితం వోల్వో కార్ల కోసం అప్పు.. ఇప్పుడు స్వీడన్‌కు ఉత్తరకొరియా చెల్లించాల్సింది ఎంతంటే..

ప్రపంచంలోని చాలా దేశాలతో విభేదాలు పెట్టుకుని తరచుగా వివాదాస్పదంగా ప్రవర్తించే దేశం ఉత్తరకొరియా (North Korea). ఆ దేశ వ్యవహారాలు ఏవీ సవ్యంగా, స్పష్టంగా బయటకు రావు. ఇతర దేశాల గురించిన సమాచారం కూడా ఆ దేశ ప్రజలకు సక్రమంగా అందదు. కేవలం చైనా (China), రష్యాతో మాత్రమే ఉత్తరకొరియా కాస్త సఖ్యతగా ఉంటుంది. ఉత్తర కొరియా నేడు కిమ్ జోంగ్ (Kim Jong) నియంతృత్వ పాలనలో ఉంది. తాజాగా ఉత్తరకొరియాకు సంబంధించిన ఓ ఆసక్తికర కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది (Viral Story).

1974లో ఉత్తరకొరియాను కిమ్ తాత కిమ్ ఇల్ సంగ్ పాలించేవాడు. ఆ సమయంలో ఉత్తరకొరియా 73 మిలియన్ డాలర్ల (రూ.600 కోట్లు) విలువైన 1,000 వోల్వో కార్లు (1,000 Volvo Cars), ఇతర మెకానికల్ పరికరాల కొనుగోలుకు స్వీడిష్ కంపెనీలకు (Sweden) ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ప్రకారం స్వీడిష్ కార్ల కంపెనీ ఉత్తరకొరియాకు కార్లు అన్నీ అప్పగించింది. అయితే 49 ఏళ్లు గడుస్తున్నా ఆ కంపెనీకి ఉత్తరకొరియా పాలకులు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అప్పట్నుంచి వడ్డీతో కలిపితే ఉత్తరకొరియా చెల్లించాల్సిన మొత్తం 330 మిలియన్ డాలర్లు (రూ.27 వేల కోట్లు)కు చేరుకుంది.

Python: బాబోయ్.. చూస్తోంటేనే గుండెదడ వచ్చేస్తోందిగా.. 17 అడుగుల కొండ చిలువ.. ఐదుగురు వ్యక్తులను ముప్పతిప్పలు పెట్టి మరీ..!

కాగా, ఆ బకాయిలను చెల్లించే ఉద్దేశం ఉత్తరకొరియాకు లేదని ఆ స్వీడిష్ కంపెనీకి అర్థమైంది. ఉత్తరకొరియాతో చేసుకున్న ఆ ఒప్పందం గురించి, డబ్బులు చెల్లించకపోవడం గురించి 2016లో స్వీడిష్ ఎంబసీ ఓ ట్వీట్ చేసింది. తాజాగా న్యూస్ వీక్ అనే అంతర్జాతీయ పత్రికలో కూడా ఉత్తరకొరియా అప్పు గురించి వార్తు ప్రచురితమైంది. కాగా, 50 ఏళ్ల క్రితం స్వీడన్ నుంచి కొనుగోలు చేసిన కార్లను ఉత్తరకొరియా ఇప్పటికీ వినియోగిస్తున్నట్టు సమాచారం.

Updated Date - 2023-11-10T21:29:22+05:30 IST