Poorest MLA: దేశంలోనే అత్యంత పేద ఎమ్మెల్యే ఇతడే.. కారు లేదు.. సొంతిల్లు కూడా లేదు.. అసలు ఈయన ఆస్తి ఎంతో తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-07-25T19:53:51+05:30 IST
ప్రస్తుత రోజుల్లో ఓ గ్రామానికి సర్పంచ్ కావాలంటేనే లక్షల్లో ఖర్చువుతోంది. కోట్ల ఆస్థి ఉంటే తప్ప ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం కష్టమవుతోంది. అలాంటిది ఎమ్మెల్యే కావాలంటే ఎంతో ధన బలం ఉండాలి. లేకపోతే ఎన్నికల్లో గట్టెక్కడం కష్టం.
ప్రస్తుత రోజుల్లో ఓ గ్రామానికి సర్పంచ్ కావాలంటేనే లక్షల్లో ఖర్చువుతోంది. కోట్ల ఆస్థి ఉంటే తప్ప ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం కష్టమవుతోంది. అలాంటిది ఎమ్మెల్యే కావాలంటే ఎంతో ధన బలం ఉండాలి. లేకపోతే ఎన్నికల్లో గట్టెక్కడం కష్టం. అయితే పశ్చిమబెంగాల్ (West Bengal)లోని ఇండస్ నియోజకవర్గం ఎమ్మెల్యే (Indus MLA) నిర్మల్ కుమార్ ధారాకు మాత్రం సామాన్య పౌరుడి స్థాయిలో కూడా అస్తులు లేవు. అతడి పేరు మీద కేవలం రూ.1700 మాత్రమే ఉన్నట్టు అఫిడవిట్‌లో నిర్మల్ పేర్కొన్నారు.
2023లో కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలోని వివరాల ప్రకారం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం (ఏడీఆర్) నిర్మల్ కుమార్ దేశంలోనే అత్యంత పేద ఎమ్మెల్యే. నిర్మల్ కుమార్ (Nirmal Kumar Dhara) భార్య అనురాధ, కూతురు అన్వేష పేరు మీద కూడా ఎలాంటి ఆస్తులూ లేవని ఆయన తెలిపారు. నిర్మల్ కుటుంబానికి స్వంత ఇల్లు, కారు కూడా లేవు. అంతేకాదు అతడి పేరు మీద ఇన్సూరెన్స్ కూడా లేకపోవడం గమనార్హం (Poorest MLA). అలాగే తనకు ఒక్క రూపాయి కూడా అప్పు లేదని నిర్మల్ పేర్కొన్నారు.
Indian Railway: రైల్వే స్టేషన్‌లో పట్టాలపై ఈ యువతి పెర్ఫార్మెన్స్‌కు.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన పోలీసులు..!
నిర్మల్ తర్వాత ఒడిశాకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే మకరంద ముదిలి రూ.15 వేల అస్తులతో రెండో పేద ఎమ్మెల్యేగా నిలిచారు. ఇక, దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shiva kumar)నిలిచారు. రూ.1400 కోట్ల విలువైన ఆస్తులతో శివ కుమార్ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నారు. శివ కుమార్ తర్వాతి స్థానంలో కర్ణాటకకే చెందిన ఎమ్మెల్యే కేహెచ్ పుట్టస్వామి ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.1267 కోట్లు.