NRI Mother: సరిగా చూసుకోవడం లేదంటూ ఇద్దరు పిల్లలను లాగేసుకున్న ఆస్ట్రేలియా అధికారులు.. ఆ ఎన్నారై తల్లి భరించలేక..!
ABN , First Publish Date - 2023-08-26T18:37:36+05:30 IST
తన ఇద్దరు పిల్లల కోసం ఆస్ట్రేలియా అధికారులతో నెలల తరబడి పోరాడి ఓడిపోయిన ఓ ఎన్నారై మహిళ బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. పిల్లలు లేని జీవితం వద్దనుకుని కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఆత్మహత్య చేసుకుంది.
తన ఇద్దరు పిల్లల కోసం ఆస్ట్రేలియా (Australia) అధికారులతో నెలల తరబడి పోరాడి ఓడిపోయిన ఓ ఎన్నారై మహిళ (NRI Mother) బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. పిల్లలు లేని జీవితం వద్దనుకుని కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఆత్మహత్య (NRI Mother commits suicide) చేసుకుంది. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న 45 ఏళ్ల ప్రియదర్శిని పాటిల్, అమె భర్త లింగరాజ్ పాటిల్ తమ పిల్లలు అమర్త్య (17), అపరాజిత (13) సంరక్షణ కోసం పోరాడుతున్నారు. అమర్త్య చాలా రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడి ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్‌లో జాయిన్ చేశారు.
అమర్త్యకు చికిత్స అందించడంలో హాస్పిటల్ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అస్ట్రేలియా అధికారులకు పాటిల్ దంపతులు ఫిర్యాదు చేశారు. మొత్తం విచారించిన తర్వాత తల్లి ప్రియదర్శినియే ప్రథమ నిందితురాలిగా తేలింది. పిల్లల ఆరోగ్యం పట్ల ఆమె శ్రద్ధ తీసుకోలేదని అధికారులు గుర్తించారు. ఆస్ట్రేలియా బాలల రక్షణ చట్టాల ప్రకారం ఆ ఇద్దరి పిల్లల బాధ్యతలను ఆస్ట్రేలియా ప్రభుత్వం (Australia authority) తీసుకుంది. అప్పట్నుంచి పిల్లలిద్దరూ తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. నెలలు తరబడి పోరాడినా పిల్లలను అప్పగించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకరించలేదు.
Viral: ఛీ..ఛీ.. ఇదేం పనయ్యా బాబూ.. కట్టుకున్న భార్యను వేశ్య అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడో ఎన్నారై భర్త!
తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియదర్శని స్వదేశానికి తిరిగి వచ్చింది. తన స్వంత ఊరికి తిరిగి వెళ్తూ మార్గమధ్యంలో నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు ఆమె తన నగలు, నగదును ఓ కవర్లో పెట్టి తండ్రికి కొరియర్ చేసింది. కాగా, ఆస్ట్రేలియా చట్టాలపై ప్రియదర్శిని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.