Viral Video: హాస్పిటల్లో ఫోన్ మాట్లాడుతున్న యువతి.. ఇంతలో ఓ వ్యక్తి గోడ దూకి వచ్చి ముద్దు పెట్టేశాడు.. వైరల్ అవుతున్న వీడియో
ABN , First Publish Date - 2023-03-13T19:13:23+05:30 IST
ఎన్ని చట్టాలు తీసుకొచ్చి కఠిన శిక్షలు అమలు చేస్తున్నా మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలు ఆగడం లేదు. లైంగిక వేధింపులు తగ్గడం లేదు.
ఎన్ని చట్టాలు తీసుకొచ్చి కఠిన శిక్షలు అమలు చేస్తున్నా మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలు ఆగడం లేదు. లైంగిక వేధింపులు (Sexual Harassment) తగ్గడం లేదు. తాజాగా బీహార్లోని (Bihar) ఓ ఆరోగ్య కార్యకర్తకు షాకింగ్ అనుభవం ఎదురైంది.. ఆమె హాస్పిటల్ ఆవరణలో ఫోన్ మాట్లాడుతుండగా ఓ యువకుడు గోడ దూకి లోపలికి ప్రవేశించాడు.. నేరుగా ఆమె దగ్గరకు వెళ్లి బలవంతంగా ముద్దు పెట్టాడు (Obscene act with a female employee).. ఆమె గట్టిగా అరిచే లోపే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. ఈ ఘటన మొత్తం ఆస్పత్రి ఆవరణలో అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది.
బీహార్లోని జముయి సదర్ ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళా ఆరోగ్య కార్యకర్తకు ఎదురైన లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఫోన్లో మాట్లాడుతూ ఆమె బయటకు వచ్చింది. ఫోన్ మాట్లాడుతుండగా ఓ యువకుడు గోడ దూకి వచ్చి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆమెను గట్టిగా ముద్దు (Kiss) పెట్టుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
Viral Video: పాపం.. పెళ్లి పీటల మీదే మత్తులో వధువు.. వరుడు చేసిన పనితో ముసి ముసి నవ్వులు..
తాను 2015 నుంచి సదర్ ఆస్పత్రిలో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేస్తున్నానని, గత ఏడెనిమిదేళ్లలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని బాధితురాలు తెలిపింది. తనపై వేధింపులకు పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.