Elon Musk: భారతీయుల టాలెంట్ చూసి ఎలాన్ మస్క్ ఫిదా! ఆయన తాజా కామెంట్ చూస్తే..
ABN , First Publish Date - 2023-08-27T15:36:50+05:30 IST
నానాటికీ పెరుగుతున్న భారతీయ సీఈఓల సంఖ్య చూసి టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ పొగడ్తల వర్షం కురిపించారు. ఇంప్రెసివ్ అంటూ ఒక్క మాటలో తన మనోభావాన్ని వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏ దేశంలో ఉన్నా సరే అక్కడి సంస్కృతి సంప్రదాయాలలో ఇమిడిపోతూ తమ ప్రతిభాపాటవాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించడం భారతీయులకు ఉన్న ప్రత్యేకత. అందుకే అమెరికాలో భారతీయులు ఇతర దేశస్తులకంటే ఉన్నత స్థాయిలో ఉన్నారు. ప్రస్తుతం అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక అంతర్జాతీయ కంపెనీలకు భారతీయులు నేతృత్వం వహించడం మనోళ్ల టాలెంట్‌కు నిలువెత్తు నిదర్శనం. అందుకే ప్రస్తుతం భారతీయులను చూసి టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఈలాన్ మస్క్(Elon Musk) కూడా అబ్బురపడుతూ ఎక్స్ వేదికగా ఓ కామెంట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(Viral News) అవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేక అకౌంట్‌లో భారతీయులు సీఈఓలుగా ఉన్న కంపెనీల జాబితా ఒకటి విడుదలైంది. ఈ జాబితా ప్రకారం.. డజనుకు పైగా అంతర్జాతీయ సంస్థలకు మనోళ్లే నేతృత్వం వహిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ మొదలు అనేక మల్టీనేషనల్ సంస్థలకు భారతీయులు నేతృత్వం(Indian Origin CEOs) వహిస్తున్నారు. ఈ లిస్ట్ ప్రకారం.. గూగుల్, మైక్రోసాఫ్ట్, యూట్యూబ్, అడోబీ, వరల్డ్ బ్యాంక్ గ్రూప్, ఐబీఎమ్, నెట్ యాప్, పావులో ఆల్టో నెట్వర్క్స్, అరిస్టా నెట్వర్క్స్, నోవార్టిస్, స్టార్‌బక్స్, మైక్రాన్ టెక్నాలజీ సంస్థలకు సీఈఓలుగా భారతీయులే ఉన్నారు.
ఈ జాబితా మస్క్ కంట పడటంతో ఆయన అబ్బురపడ్డారు. ఇంప్రెసివ్ అంటూ ఒక్క ముక్కలో హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్ వైరల్‌గా మారింది. కాగా, తాను ఇండియా వచ్చేందుకు ఎంతో ఉత్సుకతతో ఉన్నట్టు మస్క్ ఇటీవలే సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ..‘‘వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాను’’ అని చెప్పిన ఆయన భారతీయ సంప్రదాయిక దుస్తులను తాను ధరించినట్టు ఫొటోషాప్‌లో డిజైన్ చేసిన చిత్రాన్ని కూడా షేర్ చేశారు. ఈ ఏడాది జూన్‌లో మస్క్ న్యూయార్క్‌లో భారత ప్రధాని మోదీని కలిసిన అనంతరం తన భారత పర్యటన గురించి ప్రకటించారు. మోదీ తనను భారత్‌కు ఆహ్వానించారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.