వైద్యం పేరుతో అమాయక యువతికి వల.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ శునకానందం.. చివరకు ఎంత పని చేశాడంటే..
ABN , First Publish Date - 2023-03-19T17:46:25+05:30 IST
వైద్యం పేరుతో ఓ వ్యక్తి పైశాచికంగా ప్రవర్తించాడు.. ఆమాయకమైన యువతిని, ఆమె తల్లిదండ్రులను తన మాయ మాటలతో నమ్మించి మోసం చేశాడు..
వైద్యం పేరుతో ఓ వ్యక్తి పైశాచికంగా ప్రవర్తించాడు.. ఆమాయకమైన యువతిని, ఆమె తల్లిదండ్రులను తన మాయ మాటలతో నమ్మించి మోసం చేశాడు.. వాట్సాప్ వీడియో కాల్స్ చేస్తూ ఆ యువతితో చేయకూడని పనులు చేసేవాడు.. వైద్యం చేస్తున్నానంటూ యువతి రహస్య భాగాలను తాకేవాడు.. వేరే హాస్పిటల్‌కు తీసుకెళ్తానని చెప్పి ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు.. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు (Crime News).
రాజస్థాన్‌లో (Rajasthan) జైపూర్‌కు చెందిన కాలేజీ విద్యార్థినికి కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగాలేదు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు ఆమెను స్థానికంగా ఉండే ఆర్‌ఎమ్‌పీ డాక్టర్ బాగ్ అలీ (37) దగ్గరకు తీసుకెళ్లారు. వైద్యం పేరుతో అలీ ఆ యువతితో చేయకూడని పనులు (Obscene Acts) చేశాడు. ఆమె రహస్యాంగాలపై తరచుగా చేతులు వేసేవాడు. ఆమెకు వాట్సాప్ వీడియో కాల్స్ చేసి తను చెప్పినట్టు చేయమనేవాడు. అమాయకమైన ఆ యువతి అలీ చెప్పినట్టుగా చేసేది. అదంతా వైద్యమే అనుకునేది. ఈ నెల 12వ తేదీన వేరే డాక్టర్ దగ్గరకు వెళ్దామని చెప్పి బాధితురాలిని అలీ బికనీర్ తీసుకెళ్లాడు.
Viral Video: వామ్మో.. ఇదేం జంతువు.. ఒక్క గుక్కలో లేడిని ఎలా మింగేసిందో చూడండి.. ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
అక్కడ ఆమెను నేరుగా ఓ హోటల్‌కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెకు మత్తు పదార్థాలు ఇచ్చి దాదాపు మూడ్రోజుల పాటు ఆమెపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఇంటికి చేరుకున్న యువతి తనపై జరిగిన అత్యాచారాల గురించి తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.