One Day Marriage: కేవలం ఒక్క రోజు పెళ్లి.. మృతదేహానికి కూడా వివాహం.. ఈ వింత ఆచారం ఎక్కడంటే?

ABN , First Publish Date - 2023-08-14T21:49:17+05:30 IST

ఒక్క మన భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అందరి కుటుంబాల్లోనూ ఇది ఒక్కసారి జరిగే కార్యం కాబట్టి.. ప్రతిష్టాత్మకంగా పెళ్లి తంతుని...

One Day Marriage: కేవలం ఒక్క రోజు పెళ్లి.. మృతదేహానికి కూడా వివాహం.. ఈ వింత ఆచారం ఎక్కడంటే?

ఒక్క మన భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అందరి కుటుంబాల్లోనూ ఇది ఒక్కసారి జరిగే కార్యం కాబట్టి.. ప్రతిష్టాత్మకంగా పెళ్లి తంతుని నిర్వహిస్తారు. ఆయా దేశాల్లోని సంప్రదాయాల్ని బట్టి.. ఈ పెళ్లి వేడుకను కొన్ని రోజుల తరబడి కూడా నిర్వహిస్తారు. ఒక్కసారి ముడి పడిందంటే.. ఇక ఆ జంట జీవితాంతం భార్యాభర్తలుగా కలిసి ఉంటుంది. అయితే.. ఇప్పుడు ఒక దేశంలో విచిత్ర సంప్రదాయం పుట్టుకొచ్చింది. అదే.. ఒక్క రోజు పెళ్లి. అంటే.. ఒక్క రోజు మాత్రమే ఆ జంట కలిసి ఉంటారు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోవచ్చు. నమ్మశక్యంగా లేదు కదూ..! మీరు నమ్మినా నమ్మకపోయినా.. ఇది మాత్రం నిజం.


ఇంతకీ ఈ వింత ఆచారం ఏ దేశంలో ఉందని అనుకుంటున్నారా..? మరెక్కడో కాదండోయ్.. కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా. ఈమధ్య కాలంలో చైనాలోని యువతీ యువకులు పెళ్లి చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. సింగిల్‌గా ఉంటూ జీవితం లీడ్ చేయడానికే అక్కడ ఎక్కువ ఇష్టపడుతున్నారు. దీనికితోడు పెళ్లి తంతు భారీ ఖర్చుతో కూడుకున్న పని కావడంతో.. అంత డబ్బులు లేకపోవడంతో వివాహాలకు దూరంగా ఉంటున్నారు. అయితే.. చైనాలో పురుషులు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారులుగా మరిణించడాన్ని అశుభంగా పరిగణిస్తారు. అలా బ్రహ్మచారులుగా మరణిస్తే.. ఏదైనా చెడు జరుగుతుందని అక్కడ బలంగా నమ్ముతారు. అందుకే.. ఈ సమస్యని అధిగమించడం కోసం అక్కడ ఒక్కరోజు పెళ్లి సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో అయితే.. పెళ్లి కాకుండానే మరణిస్తే, వారి మృతదేహానికి వివాహం జరిపిస్తారు.

ఈ ఒక్కరోజు పెళ్లిని ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా నిర్వహిస్తారు. సాదాసీదాగా, రహస్యంగా కానిచ్చేస్తారు. గత కొంతకాలం నుంచి ఈ తరహా వివాహాలకు అక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ ఒక్కరోజు పెళ్లి పేరుతో అక్కడ భారీ బిజినెస్ జరుగుతోంది. ఒక్కరోజు పెళ్లి కోసం అక్కడ వధువుల్ని సప్లై చేస్తున్నారు. పెళ్లైన తర్వాత ఆ వధువు తిరిగి తన ప్రాంతానికి వెళ్లిపోతుంది. ఇలాంటి వధువులకు అక్కడ భారీగానే డిమాండ్ ఉంది. యువకులు బ్రహ్మచారిగా మరణించకుండా ఉండేందుకే.. ఈ ఒక్కరోజు పెళ్లి పథకాన్ని చైనా వాళ్లు తీసుకొచ్చారు. మృతదేహానికి కూడా పెళ్లి చేస్తున్నారంటే.. వారి నమ్మకాలు ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

Updated Date - 2023-08-14T21:49:17+05:30 IST