ప్రేమించిన అమ్మాయి స్కూటీకి జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చి ఓ కుర్రాడి వింత నిర్వాకం.. ఎక్కడకు వెళ్తోందో వివరాలు ఆరా తీసి మరీ..
ABN , First Publish Date - 2023-02-15T20:32:14+05:30 IST
ఆ యువకుడికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ అమ్మాయి పరిచయమైంది.. ఆ స్నేహం ప్రేమగా మారింది.. అయితే కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోరనే భయంతో అమ్మాయి ప్రేమకు ఓకే చెప్పలేదు.. అయినా ఆ అబ్బాయి వదల్లేదు.. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్లినా అక్కడ ప్రత్యక్ష్యమయ్యేవాడు..
ఆ యువకుడికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ అమ్మాయి పరిచయమైంది.. ఆ స్నేహం ప్రేమగా మారింది.. అయితే కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోరనే భయంతో అమ్మాయి ప్రేమకు ఓకే చెప్పలేదు.. అయినా ఆ అబ్బాయి వదల్లేదు.. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్లినా అక్కడ ప్రత్యక్ష్యమయ్యేవాడు.. మొదట్లో ఆ అమ్మాయి పట్టించుకోలేదు.. దీంతో అనుమానం వచ్చిన బాలిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విచారణలో అసలు విషయం బయటపడింది.
గుజరాత్‌లోని (Gujarat) సూరత్‌కు చెందిన నికుంజ్ పటేల్ అనే అబ్బాయి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఒక అమ్మాయితో స్నేహం చేశాడు. ఆ స్నేహాన్ని ప్రేమగా మార్చుకోవాలనుకున్నాడు. అయితే ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో బాలిక ప్రేమకు ఓకే చెప్పలేదు. అయినా నికుంజ్ ఆమెను వదల్లేదు. తనను ప్రేమించాలని ఆ అమ్మాయిని ఒత్తిడి చేసేవాడు. ఎప్పుడూ ఆమెను వెంబడించేందుకు ఆమె స్కూటీకి రహస్యంగా జీపీఎస్ ట్రాకర్ (GPS tracker) సిస్టమ్‌ను అమర్చాడు. దాని ద్వారా ఆ అమ్మాయి ఎక్కడ ఉందో తెలుసుకుని అక్కడకు వెళ్లి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు.
22 ఏళ్ల ఈ కుర్రాడు.. తనకంటే వయసులో 20 ఏళ్లు పెద్దయిన మహిళను ప్రేమించాడు.. ప్రస్తుతం అతడి పరిస్థితి ఏంటంటే..
తను ఎక్కడికి వెళ్తుందో నికుంజ్‌కు తెలిసి పోతుండడం ఆ అమ్మాయికి అనుమానం కలిగింది. తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ అబ్బాయిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ యువతి స్కూటీ బ్యాటరీకి సిమ్ కార్డుతోపాటు జీపీఎస్ ట్రాకింగ్ పరికరం అమర్చినట్లు యువకుడు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. యువతిపై వేధింపులకు పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.