Share News

Pakistan: బంధువులను కాదు.. బయట వారిని చూసుకోండి.. వైరల్ అవుతున్న యాడ్‌పై ఫన్నీ కామెంట్లు..

ABN , First Publish Date - 2023-12-13T15:59:53+05:30 IST

ప్రస్తుతం చాలా మంది యువతీ యువకులు తమకు కాబోయే జీవిత భాగస్వాములను వారే నిర్ణయించుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. లేకపోతే మ్యాట్రిమోనియల్ సైట్స్, డేటింగ్ యాప్స్‌లో అన్వేషించి మరీ తాము కోరుకున్న లక్షణాలున్న వ్యక్తిని ఎంచుకుంటున్నారు.

Pakistan: బంధువులను కాదు.. బయట వారిని చూసుకోండి.. వైరల్ అవుతున్న యాడ్‌పై ఫన్నీ కామెంట్లు..

ప్రస్తుతం చాలా మంది యువతీ యువకులు తమకు కాబోయే జీవిత భాగస్వాములను (Life Partners) వారే నిర్ణయించుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి (Marriage) చేసుకుంటున్నారు. లేకపోతే మ్యాట్రిమోనియల్ సైట్స్, డేటింగ్ యాప్స్‌లో (Dating Apps) అన్వేషించి మరీ తాము కోరుకున్న లక్షణాలున్న వ్యక్తిని ఎంచుకుంటున్నారు. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లిళ్ల గురించి ఆందోళన చెందడం లేదు. చాలా కొందరు మాత్రమే బంధువులు, తెలిసిన వారితో పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటున్నారు.

తాజాగా పాకిస్తాన్‌కు (Pakistan) చెందిన ఓ డేటింగ్ యాప్ ప్రకటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. @BehtareenInsan అనే ట్విటర్ ఖాతాలో ఈ యాడ్ పోస్ట్ అయింది. ముజ్ (Muzz) అనే డేటింగ్ యాప్ పాకిస్తాన్‌లోని ఓ బిల్డింగ్‌పై తమ యాడ్‌ కటౌట్‌ను ఉంచింది. అందులో ``మీ కజిన్స్‌ను (Cousins) వదలండి.. వేరొకరిని ఎంచుకోండి.. డౌన్‌లోడ్ ముజ్`` అని రాసి ఉంది. ఆ యాడ్‌ను చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral) మారింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలను కలుపడం కోసం 2015లో ముజ్ యాప్‌ను ప్రారంభించారు. కాగా, ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు 3.4 లక్షల మందికి పైగా వీక్షించారు. 38 వేల మంది కంటే ఎక్కువగా లైక్ చేశారు. ఈ యాడ్‌పై సోషల్ మీడియా జనాలు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ``డేటింగ్ యాప్ యాడ్ చాలా మందిని ఆకట్టుకుంటోంది``, ``కజిన్‌తో ఎవరైనా డేటింగ్ చేస్తారా``, ``ఇది వెరైటీ ప్రకటన``, ``ఇలాంటి యాడ్‌ను ఇప్పటివరకు చూడలేదని`` నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-12-13T15:59:55+05:30 IST