Parrot Missing: నా చిలుక తప్పిపోయింది.. వెతికి తెచ్చిన వాళ్లకు రూ.10 వేల నజరానా.. అంటూ పోస్టర్లు.. ఏంటా అని ఆరా తీస్తే..!

ABN , First Publish Date - 2023-08-03T13:03:42+05:30 IST

పోస్టర్ల ఉదంతం ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే ఇది పిల్లలో, వృద్దులో తప్పిపోయిన సంఘటన కాదు. ఓ చిలుక తప్పిపోయిన సంఘటన. దీనికోసం ఎందుకంత ఆరాటం అంటే..

Parrot Missing: నా చిలుక తప్పిపోయింది.. వెతికి తెచ్చిన వాళ్లకు రూ.10 వేల నజరానా.. అంటూ పోస్టర్లు.. ఏంటా అని ఆరా తీస్తే..!

రహదారులమీదా.. బస్టాండ్లు, వీధుల మలుపులు మొదలయినచోట్ల పిల్లలు, పెద్దలు, వృద్దులు కనబడటం లేదని పోస్టర్లు కనబడుతూ ఉంటాయి. పోస్టర్లలోని వ్యక్తులు ఎక్కడైనా కనబడితే తమకు ఆచూకీ ఇవ్వండంటూ కొందరు, పారితోషికం కూడా ఉంటుందని మరికొందరు సదరు పోస్టర్లలో పొందుపరిచి ఉంటారు. ఇలాంటి పోస్టర్ల ఉదంతం ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే ఇది పిల్లలో, వృద్దులో తప్పిపోయిన సంఘటన కాదు. ఓ చిలుక తప్పిపోయిన సంఘటన. తమ చిలుక తప్పిపోయిందంటూ ఓ కుటుంబం ఏకంగా పోస్టర్లు వేయించింది. చిలుకను వెతికి తెచ్చినవాళ్లకు 10వేల రూపాయల నజరానా అంటూ అనౌన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిలుక గురించి పోస్టర్లు ఏమిటంటూ నెటిజన్లు విస్తుపోతున్నారు. దీనికి సంబధించి పూరీ వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రం దామోహ్ జిల్లాలో వింత సంఘటన బయటకొచ్చింది. దామోహ్ నగరం ఇంద్ర కాలనీలో సోని కుటుంబం నివసిస్తోంది. వీరు ఓ చిలుకను పెంచుకుంటున్నారు(pet parrot). దానికి మిథు అనే పేరు కూడా పెట్టుకున్నారు. చిలుకను వారు ఒక పక్షిగా ఏనాడు చూడలేదు. దాన్ని ఇంట్లో మనిషిగానే చూశారు. మిథు చిలుక సోని కుటుంబ సభ్యులతో చాలాబాగా కలిసిపోయింది. మిథు చేసే అల్లరి చిన్న పిల్లల అల్లరిలా అనిపించేది సోని కుటుంబ సభ్యులకు. మంగళవారం సాయంత్రం సోని కుటుంబ సభ్యులు వాకింగ్(walking) కు వెళ్ళారు. పార్క్ లో వారు నడుస్తుండగా.. మిథు వారిని అనుసరిస్తోంది. అప్పుడే మిథును చూసి ఓ కుక్క భీకరంగా అరవడం మొదలుపెట్టింది. కుక్క అరుపు విని మిథు భయపడిదింది(parrot afraid of dog). అది వెంటనే దగ్గరలో ఉన్న చెట్టుమీదకు ఎగిరింది. ఆ తరువాత అది ఎటుపోయిందో ఏమోకానీ ఎవరికీ కనిపించలేదు. పాపం సోని కుటుంబం మిథు కోసం ఎంత వెతికినా లాభం లేకపోయింది.

Viral Video: విమానం ఎక్కగానే కళ్ల ముందు ఊహించని సీన్.. పట్టరాని ఆనందంతో ఈ మహిళ కేకలు వేయడం వెనుక..!



తాము ఎంతో ప్రేమగా పెంచుకున్న చిలుక ఇలా కనిపించకపోయేసరికి సోని కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఎలాగైనా చిలుకను తిరిగి తమ ఇంటికి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా చిలుక కనబడటం లేదంటూ పోస్టర్లు వేయించింది(posters of parrot missing). చిలుకను వెతికి తమకు అప్పగించిన వారికి 10వేల రూపాయల నజరానా ఇస్తామంటూ పోస్టర్లలో ప్రకటించింది(ten thousand reward). తాము పెంచుకుంటున్న మిథు అనే పేరు కలిగిన చిలుకకు మాటలుకూడా వచ్చని సోని కుమారుడు దీపక్ సోనీ చెప్పుకొచ్చాడు. దాన్ని వారు రెండేళ్ల నుండి పెంచుకుంటున్నట్టు కూడా తెలిపాడు. చిలుకను వాకింగ్ కు తీసుకెళ్ళడం రోజూ జరిగేదే అయినా ఆరోజు కుక్క వల్ల మిథు భయపడి పారిపోయిందని చెప్పాడు. కేవలం నగదు ప్రకటన మాత్రమే కాకుండా వీరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. స్నేహితులు, బంధువుల సహాయంతో మిథు కోసం వెతుకుతున్నారు. దీన్ని బట్టి ఆ చిలుక వారి జీవితాల్లో ఎలాంటి స్థానం సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు.

Tigers Video: బస్సును చుట్టుముట్టిన పులులు.. గజగజ వణికిపోయిన ప్రయాణీకులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!


Updated Date - 2023-08-03T13:03:42+05:30 IST