Viral: ఏదో కాలుతున్న వాసన వస్తోందంటూ ఓ ప్రయాణీకుడికి డౌట్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలెట్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2023-08-07T15:31:08+05:30 IST

ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో విమానం ఎగురుతున్నప్పుడు ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినా, ఎవరైనా ప్రయాణికుడు అస్వస్థతకు గురైనా దగ్గర్లో ఉన్న విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు. విమానం టేకాఫ్ అయి కొద్ది సేపే అయితే తిరిగి అదే ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేస్తారు.

Viral: ఏదో కాలుతున్న వాసన వస్తోందంటూ ఓ ప్రయాణీకుడికి డౌట్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలెట్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో విమానం (Flight) ఎగురుతున్నప్పుడు ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినా, ఎవరైనా ప్రయాణికుడు అస్వస్థతకు గురైనా దగ్గర్లో ఉన్న విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Landing) చేస్తారు. విమానం టేకాఫ్ అయి కొద్ది సేపే అయితే తిరిగి అదే ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేస్తారు. తాజాగా ఓ ఎయిర్ ఎండియా ఎక్స్‌ప్రెస్‌ను అలాగే అత్యవసరంగా కోచి విమానాశ్రయంలో (Kochi International Airport) ల్యాండ్ చేశారు. అయితే ఆ తర్వాత అసలు కారణం తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఘటన సంచలనంగా మారింది.

ఈ నెల 2వ తేదీ రాత్రి కేరళలోని కోచి నుంచి షార్జాకు 175 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానం బయల్దేరింది. విమానం పైకి ఎగిరిన కొద్ది సేపటికే విమానం నుంచి ఏదో ఘాటైన, మండుతున్న వాసన వస్తున్నట్టు ఓ ప్రయాణికుడు గుర్తించాడు. వెంటనే సిబ్బందికి సమాచారం అందించాడు. అతడికి మాత్రమే కాదు.. ఇతర ప్రయాణికులు కూడా అదే వాసన వచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా విమానాన్ని వెనక్కి మళ్లించాలని పైలెట్ నిర్ణయించుకున్నాడు. ఎలాంటి ప్రమాదమూ లేకుండా కోచి విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు (Air India Express Emergency Landing).

Viral: అయ్య బాబోయ్.. ఇది బాత్రూంలోకి ఎలా వచ్చిందబ్బా..? స్నానం చేసేందుకు వెళ్లిన ఆ వ్యక్తి లోపల దాన్ని చూసి షాక్..!

వెంటనే సిబ్బంది అంతా వచ్చి ఆ వాసన ఎక్కడి నుంచి వస్తోందో తెలుసుకునేందుకు తనిఖీ నిర్వహించారు. ఎలాంటి సాంకేతిక సమస్యా కనిపించలేదు. చివరకు విమానం కార్గోలో ఉంచిన ఉల్లిపాయల (Onion) బాక్సు నుంచి ఆ ఘాటైన వాసన వస్తున్నట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సాధారణంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాల్లో పండ్లు, కూరగాయలు, పూలను భారీగా లోడ్ చేస్తుంటారు. సదరు ఘటనపై విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది.

Updated Date - 2023-08-07T15:31:08+05:30 IST