Tomato Price Effect: టమాటా ధరలు పెరగడంతో కొత్త రూటు.. వాటికి బదులుగా ఇప్పుడు వేటిని వాడుతున్నారో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-08-05T12:24:38+05:30 IST

ప్రస్తుతం టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం సామాన్యుల వంటగది నుంచి టమాటా మాయమైంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కిలో టమాటా ధర రూ.200 వరకు ఉంది. రానున్న రోజుల్లో కిలో రూ.300కు చేరే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు.

Tomato Price Effect: టమాటా ధరలు పెరగడంతో కొత్త రూటు.. వాటికి బదులుగా ఇప్పుడు వేటిని వాడుతున్నారో తెలిస్తే..!

ప్రస్తుతం టమాటా (Tomato) ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం సామాన్యుల వంటగది నుంచి టమాటా మాయమైంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కిలో టమాటా ధర రూ.200 వరకు ఉంది (Tomato Prices). రానున్న రోజుల్లో కిలో రూ.300కు చేరే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టమాటా ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో టమాటా స్ధానంలో అవకాడో (Avocado)ను వాడడం మంచిదని ఆమె సూచించింది.

నిజానికి అవకాడో ధరలు చాలా ఎక్కువగా ఉండేవి. అయితే ఇటీవలి కాలంలో అవకాడో ధరలు పతనమవుతూ వస్తున్నాయి. అదే సమయంలో టమాటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కిలో అవకాడో ధర, కిలో టమాటా ధరకు దాదాపు సమానంగా ఉంది. @_subiii_ అనే ట్విటర్ యూజర్ ఆ విషయాన్ని తెలియజేస్తూ.. ``ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దోశ, టమాటా చట్నీ (Tomato Chuntney) తయారు చేసుకోవడం కంటే అవకాడో టోస్ట్ తయారు చేయడం చౌకగా ఉంద``ని ఆమె కామెంట్ చేశారు (Viral).

Viral Video: హైదరాబాద్ వంటి సిటీల్లో ట్రాఫిక్ జామ్స్‌కు ఇలాంటి ఘటనలూ కారణమే.. ఓ డ్రైవర్ ఏం చేశాడో మీరే చూడండి..!

ఈ పోస్ట్‌పై చాలామంది నెటిజన్లు స్పందించారు. అవకాడో అంత తక్కువ ధరకు రావడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ``అవకాడో అంత తక్కువ ధరకు రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది``, ``టమాటా, అవకాడో ధరలు ఇలా మారడం చూస్తానని అనుకోలేదు``, ``విధి వైపరీత్యం అంటే ఇదే``, ``నమ్మలేకపోతున్నా. భారత్‌లో అవకాడో కంటే టమాటా ధరలు ఎక్కువగా ఉన్నాయా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-08-05T12:25:01+05:30 IST